నల్లగొండ: పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు కలిపిన కూల్డ్రింక్ను భార్యకు తాగించి.. ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏఎస్ఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన బడుగుల వెంకటయ్య(43)- జ్యోతి దంపతులు ఈనెల 16న కుమార్తె వివాహం జరిపించారు. ఆదివారం తమ కుమార్తెను అత్తగారి ఇంటి నుంచి తీసుకురావాల్సి ఉండగా, పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ను భార్య జ్యోతికి ఇచ్చి, తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని గడియ పెట్టుకున్నాడు.
అప్పటికే కొంచెం కూల్డ్రింక్ తాగిన జ్యోతి పురుగుల మందు వాసన ఉండడంతో పారబోసింది. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి తలుపులు తెరిచారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన నల్లగొండకు తరలించారు. వెంకటయ్య మృతి చెందగా, జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..