ఆదిలాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటల్స్‌లో స్టేట్ ఫుడ్ స్టేఫ్టీ టాస్క్ ఫోర్స్ హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జోతిర్మయి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నాణ్యతలేని ఆహార పదార్థాలను గుర్తించారు. కుళ్లిన మాంసంతో పాటు, వారాల కొద్దీ రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసిన నాన్-వెజ్‌ను గుర్తించారు. ఫంగస్ ఏర్పడ్డా కూడా వంటల్లో కూరగాయాలను వాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కొద్దీ వెజ్, నాన్ వెజ్ పదార్ధాలను సీజ్ చేయడంతో పాటు ప్రముఖ హోటళ్లు, పేరుమోపిన రెస్టారెంట్లకు నోటీసులిచ్చారు.
నగరంలోని లక్ష్మీనరసింహ ఫ్యామిలీ రెస్టారెంట్, ఢిల్లీవాలా స్వీట్ హౌజ్, లోటస్ గ్రాండ్, వెంకటేశ్వర స్వీట్‌హౌజ్‌తో పాటు పలు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. అపరిశుభ్రంగా లేని ఆహారాన్ని ప్రతిరోజు అందిస్తున్నారని తెలిపారు. కిచెన్‌లో ఏ ఒక్క పాత్ర కూడా క్లీన్‌గా లేదన్నారు. ఆహార పదార్థాల్లో కెమికల్స్ వాడుతున్నారని వెల్లడించారు. అధిక డబ్బు వసూలు చేయడంతో పాటు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు స్టేట్ ఫుడ్ సేప్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్ జ్యోతిర్మయి. ఇప్పటికైనా అవుట్ సైడ్ ఫుడ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!