తెలంగాణ ప్రభుత్వం మత్తు రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఒకచోట దాని ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో గంజాయి గప్పుమంటోంది. రామాయంపేట 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో గంజాయి మూటలు బయటపడ్డాయి. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కార్ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. గంజాయి రవాణాతో జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న కారు బోల్తాపడింది. కారు వదిలిన దుండగులు పరారయ్యారు. అదే రూటులో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు కారు ప్రమాదాన్ని గుర్తించారు. కారును తనిఖీ చేయగా అందులో గంజాయి మూటలు బయటపడ్డాయి. మూడు సంచుల్లో 32 ప్యాకెట్లను గుర్తించారు. సుమారు 90 కేజీలకు పైగా ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
ఓవైపు స్టాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ గంజాయికి బానిసవ్వటమే కాకుండా, విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యారు నలుగురు నిందితులు. ఈఘటన హైదరాబాద్ కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని పలు జిల్లాలకు చెందిన నలుగురు యువకులు రాజేశ్, నాగవంశీ, రమేశ్ కృష్ణ, సాయిగోపి విహారి హాస్టల్‌లో ఉంటూ సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరు గంజాయిసేవించడమే కాకుండా, దానిని యువకులకు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 1300 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు రిమాండ్‌కి తరలించారు.
Also read
- Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..
- Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం
- August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు..
- Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు





