సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్ల నియామకాల్లో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలను మళ్లీ అప్పగించారు. దీంతో సజ్జలను పక్కకు పెట్టి.. సాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ వైసీపీలో సాగుతోంది.
గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ ప్రక్షాళనపై మాజీ సీఎం జగన్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అనేక మంది ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. సజ్జల తమ అధినేత జగన్ కు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చారని ధ్వజమెత్తారు. ఆయన కారణంగానే పార్టీ ఓటమిపాలైందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నంబర్ 2గా వ్యవహరించిన సజ్జల పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించారన్న టాక్ కూడా ఉంది. ముఖ్యంగా చంద్రబాబుపై కేసులు, అధికారుల పోస్టింగ్ లో పరిధికి మించి వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కూడా సజ్జలపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది
ఈ క్రమంలోనే ఆయనను పార్టీ కీలక బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఈ రోజు రీజనల్ కో-ఆర్డినేటర్లను నియమించిన జగన్ సజ్జలకు ఛాన్స్ ఇవ్వలేదు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలు- ఎంపీ మిథున్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి కృష్ణా – ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఉమ్మడి ఈస్ట్, వెస్ట్ గోదావరి – బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం – విజయసాయిరెడ్డి కడప, అనంతపురం, కర్నూలు- వైవీ సుబ్బారెడ్డిని కోర్డినేటర్లుగా నియమించారు జగన్.
విజయసాయిరెడ్డికి మళ్లీ బాధ్యతలు..
గతంలో విశాఖ కో-ఆర్డినేటర్ పదవి నుంచి విజయసాయిరెడ్డిని జగన్ తప్పించారు. అక్కడ వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. తాజాగా మళ్లీ సుబ్బారెడ్డిని తప్పించి విజయసాయిరెడ్డికి అవకాశం కల్పించారు. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాల కో-ఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని తాజాగా నియమించారు. విజయసాయిరెడ్డికి సజ్జల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు జరిగిందని చెబుతుంటారు. అయితే.. అప్పుడు సజ్జల మాటే నడిచిందన్న టాక్ ఉంది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత సీన్ రివర్స్ అయ్యిందన్న చర్చ ప్రస్తుతం సాగుతోంది. ఇప్పుడు సజ్జల ప్రాధాన్యం తగ్గించి విజయసాయిరెడ్డికి జగన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి
Also read
- Andhra Pradesh: ఆ గ్రామానికి రక్షకులు ఆ పక్షులే… సెక్యూరిటీ గార్డుల్లా కాపలా..!
- Telangana: ఏం టార్చర్ రా ఇది..! ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఏం చేశాడో తెలుసా?
- వామ్మో.. చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు.. ఎక్కడో తెలుసా?
- నేటి జాతకములు 25 నవంబర్, 2024
- Ayyappa Devotees: అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు.. 18 సార్లు తీసుకుంటే ఏమని పిలుస్తారో తెలుసా