వైసీపీ హయాంలో రెచ్చిపోయి.. ప్రతిపక్ష నేతలను ఇష్టానుసారం దూషించిన బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
గుంటూరు: వైసీపీ హయాంలో రెచ్చిపోయి.. ప్రతిపక్ష నేతలను ఇష్టానుసారం దూషించిన బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గుంటూరు నగరంలో పలు విద్యాసంస్థల అధినేత కర్లపూడి బాబూ ప్రకాష్ ను రూ. లక్షల్లో డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్ పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నల్లపాడు పీస్ లో రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం.
అనిల్ పై గతంలో పట్టాభిపురం, అరండల్ పేట్ సహా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఫోన్ చేసి.. జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని బెదిరింపులకు పాల్పడ్డాడు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై చేయి చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. తన నివాసం వైపు నుంచి వెళ్లే స్థానికులను కూడా అటకాయించి దౌర్జన్యానికి పాల్పడేవాడు. వైసీపీ కు అనుకూలంగా, ప్రతిపక్షాలను దూషిస్తూ సోషల్ మీడియాలో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసేవాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న అనిల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Also read
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!
- చెప్పులు వేసుకుని స్కూల్కు వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్! విద్యార్థిని మృతి