తన కూతురిని ప్రేమ పేరుతో లేపుకెళ్లిపోతున్నాడని అడ్డుకున్నందుకు ఓ తల్లిని ప్రేమికుడి ఫ్రెండ్స్ అత్యంత దారుణంగా చితకబాదారు. హైదరాబాద్ నగరం బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న సానియా బేగం భర్త చనిపోయాడు. ఆమెకి నలుగురు కూతుళ్లు కాగా, అందులో ఇద్దరికి వివాహాలు అయిపోయి అత్తవారింట్లో ఉంటున్నారు. ఇక మిగతా ఇద్దరు కూతుళ్లకి పెళ్లి కావాల్సి ఉంది. ఆ ఇద్దరు కూతుళ్లు ఈవెంట్లో జాబ్ చేసుకుంటూ తల్లితో పాటు కలిసి జీవిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉండగా, వాళ్ల ఇంటి సమీపంలో ఉండే హామీర్ అనే వ్యక్తి ఆ ఇద్దరిలో ఒక కూతురిని ప్రేమ పేరుతో ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతుండగా గమనించిన తల్లి ఆపే ప్రయత్నం చేసింది.
గట్టిగా కేకలు పెడుతూ ఇరుగుపొరుగు వారిని సాయం కోసం పిలిచింది. తన కూతురిని ఆ వ్యక్తి అలా తీసుకెళ్లిపోతుండడం చూసి తట్టుకోలేని ఆ తల్లి ఎలాగైనా అతనిని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఆ ప్రేమికుడితో పాటు అతని ఫ్రెండ్స్, బంధువులు తల్లి సానియాపై అత్యంత దారుణంగా దాడి చేసి పారిపోయారు. అయితే.. ఆ అబ్బాయే తన కూతురికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడా? లేదా ఆ కూతురే తనంతట తానుగా ఇష్టంతో వెళ్లిందా? అనేది తెలియాల్సి ఉంది. తన కూతురిని ప్రేమ పేరుతో వేధించి హింసించి తీసుకెళ్లిపోతుంటే ఆపే ప్రయత్నం చేసినందుకు ప్రేమికుడు, అతని ఫ్రెండ్స్ తనపై దాడి చేసినట్టు తల్లి సానియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, మహిళపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులపై బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల విచారణలో కొన్ని ఊహించని విషయాలు బయటికి వచ్చాయి. ఆ అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ తరచుగా మాట్లాడుకోవడంతోనే ఈ గొడవకి కారణం అయిందని తేలింది. అమ్మాయి, అబ్బాయి తరచుగా మాట్లాడుకుంటుంటే తన కూతురు చెప్పిన విషయాన్ని విని తల్లి ఆ అబ్బాయి కుటుంబంతో గొడవ పడింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఇరు కుటుంబాలు కొట్టుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు
Also read
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?
- శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే!





