October 17, 2024
SGSTV NEWS
Spiritual

దేవీ శరన్నవరాత్రులలో అద్భుతం.. అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టిన దృశ్యం..!వీడియో



జంగారెడ్డిగూడెంలో ఏదో మంచి జరుగుతుందని అమ్మవారు సంకేతం ఇచ్చారనే విధంగా తామ భావిస్తున్నామని అంటున్నారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఏటువంటి కష్టాలు ఉండవని అమ్మవారు ఆలయంలో కొలువై ఉన్నారనేదానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు.


దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు రోజుకో రూపంలో దుర్గమ్మను కొలిచి పూజలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక అలంకరణలు ఆయా ఆలయాలకు, మండపాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ రకాల నైవేద్యాలతో పాటు బంగారామ్, వెండి వస్తువులను సైతం అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అయితే జంగారెడ్డి గూడెంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.




దైవానికి సంబంధించి అమ్మవారి విగ్రహం పాలు తాగిందని, విగ్రహం కంట్లో నుంచి కన్నీరు కారుతుందని, సాయి బాబా ఫోటో నుంచి విభూది రాలుతుందని, అలాగే వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని ఎన్నోసార్లు మనం విన్నాం. చూశాము. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినపుడు ఆసక్తికర కధలు ప్రచారంలోకి వస్తాయి. ఈ సంఘటనలు ఎంతో వింతగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. కానీ, ఇప్పుడు జంగారెడ్డి గూడెంలో జరిగిన ఓ వింత సంఘటన దైవానికి సంబంధించినదే. కానీ ఎప్పుడూ వినని, చూడని వింతగా స్థానికులు చెబుతున్నారు. ఆ ఘటన చూసిన భక్తులు అది అమ్మవారి మహిమ అని, దానివల్ల తమ పట్టణానికి మంచి జరుగుతుందని భావిస్తున్నారు. ఇంతకీ అక్కడ జరిగిన వింత ఏంటి… అంతగా చెప్పుకునేలా ఆ ఘటనలో ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామా …

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహంకు చెమటలు పట్టినట్లు నీటి బిందువులు అమ్మవారి ముఖంపై కనిపించటం భక్తులను ఆశర్యపరిచింది. ఇది గమనించి ముందుగా విస్మయం చెందిన పలువురు తర్వాత తేరుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహానికి ఎన్నడూ లేని విధంగా విపరీతంగా చెమటలు పట్టాయి. ఆ వింత చూసిన స్థానిక భక్తులు, ఆలయ కమిటీ అది అమ్మవారి మహిమగా చెబుతున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు 9వ రోజు వాసవి మాత మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేసి అర్చకులు 108 హారతులు వెలిగించి అమ్మవారికి పట్టారు. హారతులు పట్టిన తర్వాత ఒక్కసారి అమ్మవారి విగ్రహం పై నీటి బిందువులు కనిపించటాన్ని ఆలయ అర్చకుల తో పాటు, స్థానిక భక్తులు చూసారు.


అమ్మకు చెమటలు అచ్చం మనిషి ముఖంపై ఏ విధంగా చెమటలు పడతాయో అదేవిధంగా అమ్మవారి ముఖంపైనా కనిపించటంతో అది అమ్మ మహిమగా నిర్ధారించుకున్నారు. ఒక్కసారిగా అక్కడికి భక్తులు పెద్దఎత్తున క్యూ కట్టారు. అయితే ఇలా అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం ఇంతకుముందు ఎన్నాడూ చూడలేదని ఆలయ అర్చకులు నాగ వెంకట రమణ శర్మ అన్నారు. నేడు అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులను కటాక్షించారని, ఇది అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.



అదేవిధంగా కమిటీ సభ్యులు ఇలాంటి ఘటన జరగడం ఇంతకు మునుపెప్పుడు వినడం గానీ, చూడడం గానీ, జరగలేదని జంగారెడ్డిగూడెంలో ఏదో మంచి జరుగుతుందని అమ్మవారు సంకేతం ఇచ్చారనే విధంగా తామ భావిస్తున్నామని అంటున్నారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఏటువంటి కష్టాలు ఉండవని అమ్మవారు ఆలయంలో కొలువై ఉన్నారనేదానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

Also read

Related posts

Share via