November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

తిరుమలలో గోపురం దగ్గర మీడియా పాయింట్ ఎత్తివేయాలి.. బ్రాహ్మణ చైతన్య  వేదిక డిమాండ్


దువ్వాడ శ్రీనివాస్ పై టిటిడి అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోండి…

అతనికి రంగనాయక మండపంలో ఆశీర్వచనం ఇవ్వడం అభ్యంతరం తెలియజేస్తున్నాం..

*ఏడుకొండలపై దివ్వెల మాధురి ఫోటో షూట్‌ దారుణం….*


*మాడవీధులు, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఫోటోషూట్‌ చేయడం దేనికి సంకేతం….*

*త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి తిరుమలలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేస్తారా…*

*ఫోటోషూట్ కు అనుమతి ఇచ్చిన విజిలెన్స్ పోలీసు టిటిడి అధికారుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా సిరిపురపు శ్రీధర్ డిమాండ్*

అమరావతి:
గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ తిరుమలలో విఐపి ల పేరుతో దర్శనానికి వెళ్లి వచ్చిన వారిని ఇంటర్వ్యూల పేరుతో రాజగోపురం వద్ద వీడియో షూట్ లు తీయటం స్వామి వారిని అవమానించటమేనని, తిరుమల స్వామి వారి కన్నా ఎవరు వీఐపీ లేరని ఆయన ముందు రాజకీయాలు మాట్లాడటం విమర్శలు చేసుకోవడం తిరుమల సంప్రదాయాలకు విరుద్ధమని దీని అరికట్టే దిశగా చంద్రబాబు ప్రభుత్వం కృషి చేయాలని, తిరుమల విహార కేంద్రం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రమని ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి అపచారాలను అరికట్టాల్సిన బాధ్యత టిటిడి పైన రాష్ట్ర ప్రభుత్వం పైన కచ్చితంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు కాపాడాలని, వీటి అరికట్టేందుకు కోసం కఠిన చర్యలు తీసుకునే లాగా విధి విధానాలతో పాటు ఒక స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాసు మాధురి అంశం చర్చనీయాంసమై వారి అక్రమ సంబంధం మీడియాలలో కూడా చర్చ జరిగింది.ఈ నేపథ్యంలో వారిద్దరు కలిసి తిరుమలను అపవిత్రం చేయడానికి జగన్ ప్రత్యేకంగా ఏమైనా పంపాడని శ్రీధర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి వారికి రంగనాయక మండపంలో ఎలా ఆశీర్వచనం అందజేస్తారని అధికారులను, దేవాలయంలో వేద పండితులను ప్రశ్నించారు ప్రధాన అర్చకులుగా ఉన్నవారు దేవాలయంలో అపచారం జరుగుతుంటే అడ్డుకట్ట వేయాల్సిందేనని, ఇలాంటి చర్యల పట్ల ఆయనకు పూర్తి బాధ్యతతో ప్రధాన అర్చకుడు పదవి ఇచ్చి దేవాలయ కైంకర్యాలు నివేదనలు భక్తుల మనోభావాలు స్వామివారి కి కలిగే అపరాధిష్ట పైన స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం భగవంతుడు ప్రసాదించాడని, దాన్ని ఆయన ఎవరికి భయపడకుండా అమలుపరచాల్సిందిగా శ్రీధర్ సూచించారు. తిరుమలలో మీడియా పాయింట్లు రాజగోపురం నుంచి తీసివేసి రామ్ భాగిచ ప్రాంతంలో కానీ వేడి ఆంజనేయస్వామి గుడి వెనక కానీ ఏర్పాటు చేయాల్సిందిగా శ్రీధర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే గత జగన్ ప్రభుత్వంలో డ్రోన్ కెమెరాలతో షూటింగ్లు నిర్వహించారని, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు ఫోటోషూట్లను నిర్వహించలు ఫోటో, వీడియో షూట్ లు నిర్వహించడం స్వామి వారి దేవాలయాన్ని అపవిత్రం చేయటమేనని దీనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఇటువంటి అపచారాలు జరిగి భక్తులు కేసులు పెడితే కనీసం తిరుమల పోలీసులు కేసులు నమోదు చేయకుండా గ్రామాలు ఆడారని ఎప్పటికైనా ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేసి బాధ్యులైన అందరి పైన చర్యలు తీసుకోవాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దృష్టిలో విఐపిలు ఎవరో అనేది స్పష్టంగా భక్తులకు డిటిడి అధికారులు తెలియజేయాలని, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, కబ్జాదార్లు, వ్యభిచారులు, తాగుబోతులు, ఆర్థిక నేరగాళ్లు, శిక్షలు పడిన ముద్దాయిలు, నేరస్తులు, దోపిడీదార్లు, సమాజంలో చెడ్డవారుగా ఉన్నవారు వీరందరికీ రంగనాయక మండపం ఆశీర్వచనాలు ఇవ్వడానికి కేటాయించారా అని శ్రీధర్ ప్రశ్నించారు. టిటిడి అధికారులు మెప్పుకోసం, పై డబ్బులు కోసం ఆశీర్వచనాల పేరుతో స్వామివారి సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని దీనికి అడ్డుకట్ట కూటమి ప్రభుత్వం వేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.

Also read

Related posts

Share via