• చిత్రదుర్గ జిల్లాలో ఘోరం
. భార్య, ప్రియుడు, మరొకరు అరెస్టు
బళ్లారి/ రాయచూరు: ప్రియుని పై మోజుతో ఓ
భార్య కట్టుకున్న భర్తను కాటికి పంపింది. నిద్ర మాత్రలు ఇచ్చి ఆ తర్వాత గొంతుకు తాడుతో బిగించి చంపారు. కడుపు నొప్పితో చనిపోయాడని అందరిని నమ్మించింది కానీ చట్టం కళ్లు కప్పలేకపోయింది. ఘరానా భార్య, ఆమె ప్రియున్ని పోలీసులు కటకటాలపాలు చేశారు. ఈ సంఘటన చిత్రదుర్గ జిల్లాలోని చెళ్లకెర తాలూకా యాదలగట్టి గ్రామంలో చోటు చేసుకుంది
అడ్డు తొలగించుకోవాలని
రాఘవేంద్ర (35), దివ్య (30) దంపతులు జీవిస్తున్నారు. కొంతకాలంగా స్థానికుడు రాజన్నతో ఆమెకు పరిచయం ఏర్పడి అనైతిక బంధానికి దారితీసింది. ఇది తెలిసి పద్ధతి మానుకోవాలని రాఘవేంద్ర భార్యను దండించాడు. భర్త ఉంటే తమ ఆటలు సాగవని దివ్య, రాజన్న భావించారు. దీంతో హత్యకు పన్నాగం వేశారు. ఆమె సొంత చిన్నాన్న మారణ్ణ, ప్రియుడు రాజన్నతో కలిసి నాలుగురోజుల కిందట భర్తకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది.
తిని మత్తులోకి జారుకున్నాక ముగ్గురూ కలిసి గొంతుకు తాడు బిగించి చంపివేశారు. కడుపునొప్పి వల్ల చనిపోయాడంటూ బాబాయ్ కలిసి నాటకం ఆడింది. స్థానికులు, పోలీసులు మొదట తీవ్రంగా పరిగణించలేదు. అయితే పోస్టుమార్టం చేయగా, శరీరం లోపల గాయాలు ఉండడంతో హత్యగా నిర్ధారించారు. దివ్య, మారణ్ణ, రాజన్నను అదుపులోకి తీసుకున్న విచారించగా నిజం ఒప్పుకున్నారు. సీఐ హనుమంతప్ప, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మరిన్ని వివరాలను సేకరించారు
Also read
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..





