November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

తెలంగాణ : ఖమ్మంలో హృదయవిదారక ఘటన.. కోతులకు విషాహారం పెట్టిన దుండగులు

తల్లిలేని పిల్లల జీవితం ఊహించడమే కష్టం. తండ్రి లేకపోయినా అమ్మ అన్నీ తానై బిడ్డలను పెంచుతుంది. కన్నబిడ్డల కోసం తన జీవితాన్నే ధారపోస్తుంది. అలాంటి తల్లిని కోల్పేతే ఆ పిల్లల జీవితం ఎంతటి భయానకమో చెప్పనక్కర్లేదు. ఇది మనుషులకైనా, జంతువులకైనా ఒక్కటే. దుండగులు చేసిన విష ప్రయోగానికి తల్లిని కోల్పోయి దిక్కు తోచక తల్లి బతికి ఉందో లేదో కూడా తెలియక అమాయకంగా ఆ తల్లి మృతదేహం వద్ద బిక్కు బిక్కు మంటూ చూస్తున్న చిన్ని కోతిపిల్ల చూపరులను కంటతడి పెట్టించింది.


గుర్తు తెలియని దుండగులు చేసిన అమానుషమైన పనికి కోతులు మృతి చెందాయి. ఆహారంలో విషం కలిపి కోతులకు పెట్టడంతో అది తిన్న 12 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలోనీ సింగరేణి వై జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. సింగరేణి ప్రైవేట్ లారీ అసోషియేషన్ కార్యాలయం సమీపంలో కోతులు గుంపులు. గుంపులుగా కుప్పకూలి పడిపోతున్నాయని అటవీ శాఖ అధికారులు కు కొందరు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోక పోవడంతో పదుల సంఖ్యలో కోతులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మృత్యు వాత పడ్డాయి.

ఈ క్రమంలో పది రోజులు కూడా నిండని ఓకోతి పిల్ల, తన తల్లి కోతి ఇంక రాదని, ప్రాణాలతో లేదని తెలియక తల్లి కోతి వద్ద కూర్చుని అమ్మను లేపుతోంది. అమ్మ.. అమ్మ.. లే అన్న అన్నట్టు గా తల్లి కోతి మొహంలో మొహం పెట్టి రోధించిన తీరు అందరినీ కలచివేసింది. ఈ విషాద ఘటనపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతుల విషయంలో సత్తుపల్లి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినా ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరించిన తీరుపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకొని వెటర్నరీ వైద్యులతో చికిత్స చేయించి ఉంటే కొన్ని కోతులైనా ప్రాణాలతో బయట పడేవని, ఆ పిల్ల కోతులకు తల్లి ప్రేమ దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also read

Related posts

Share via