శ్రీకాకుళం
విజయనగరం
సెప్టెంబర్ 30న మరియు అక్టోబర్ 1వ తారీఖున శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలలో జరిగిన ఆయా జిల్లాల సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాలకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ హాజరైనారు.
👉ఈ సమావేశాలలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి విజయనగరం MP శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు మరియు శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీకాకుళం MLA శ్రీ గొండు శంకర్ లను రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి సన్మానించి, అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన వై.వి.బి రాజేంద్రప్రసాద్.
✍️ఈ సందర్భంగా MP కలిశెట్టి అప్పలనాయుడు మరియు MLA గొండు శంకర్ లను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇద్దరు కూడా పంచాయతీరాజ్ ఛాంబర్ లో మరియు తెలుగుదేశం పార్టీలో ఎంతో ఓర్పుతో, సహనంతో, క్రమశిక్షణతో ,నిబద్ధతతో పట్టుదలతో, సమయస్ఫూర్తితో పని చేసి MP ,MLA లు కావాలన్న వారి కలలను నిజం చేసుకున్నారని తెలియజేశారు.
✍️MP కలిశెట్టి అప్పలనాయుడు మరియు MLA గుండు శంకర్ లు మాట్లాడుతూ ఎన్ని ఉన్నత పదవులు అలంకరించినా మేము పంచాయతీరాజ్ ఛాంబర్ లో సభ్యులమేనని భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల కొరకు చాంబర్ తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని అంతేకాకుండా రాబోయే రోజుల్లో పంచాయతీ రాజ్ ఛాంబర్ లోనే కొనసాగుతామని తెలియజేశారు.
✍️గతంలో ఎంతో మంది నాయకులను తయారుచేసిన మన పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచ్ల సంఘం భవిష్యత్తులో మన కమిటీలో చాలామందికి ఉన్నత పదవులు పొందడానికి ఒక వేదిక అని పునరుద్ఘాటించారు .
✍️ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీమతి వానపల్లి లక్ష్మి ముత్యాలరావు, ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణ నాయుడు, కొత్తపు ముని రెడ్డి, వానపల్లి ముత్యాలరావు, చింతకాయల ముత్యాలు .రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావు , శ్రీకాకుళం,చిత్తూరు మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల పంచాయతీరాజ్ చాంబర్ అద్యక్షులు భానోజి నాయుడు,చుక్కా ధనుంజయ్ యాదవ్, బొర్ర నాగరాజు. సర్పంచుల సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షుడు సోము నాయుడు, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అప్పలనాయుడు ,ఆర్గనైజింగ్ కార్యదర్శి రౌతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


Also read
- హనుమంతుడి ఆశీస్సుల కోసం హనుమంతుడి జయంతి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..
- Lucky Zodiac Signs: చంద్ర మంగళ యోగం.. ఆ రాశుల వారికి అధికారం, ఆదాయం పక్కా..!
- నేటి జాతకములు..8 ఏప్రిల్, 2025
- Crime : ఏమైంది.. ఉరేసుకొని వివాహిత, యువతి ఆత్మహత్య!
- TG Crime: భూ వివాదం.. కొడవలితో తల్లిదండ్రులపై దాడి చేసిన కొడుకు!