రక్త పరీక్ష మాత్రమే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తెలియజేస్తుంది. అయితే యూరిక్ లెవెల్ స్థాయిని అర్థం చేసుకోవడానికి రక్త పరీక్ష మాత్రమే మార్గం కాదు. అందుకు బదులుగా కొన్ని లక్షణాలు కనిపిస్తే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువ లేదా తక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తాయి. ఎందుకంటే మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌ను తొలగించాలని కోరుకుంటాయి.
ప్రస్తుతం ఈ యూరిక్ యాసిడ్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ఇవన్నీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచడానికి కారణాలు కావచ్చుయూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే శరీరంలో రకరకాల సమస్యలు వస్తాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలలో ఒకటి కీళ్ల నొప్పులు. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నారో లేదో అర్థం చేసుకోవడానికి.. వైద్యులు వివిధ లక్షణాల కోసం రక్త పరీక్షలను సూచిస్తారు. రక్త పరీక్ష మాత్రమే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తెలియజేస్తుంది. అయితే యూరిక్ లెవెల్ స్థాయిని అర్థం చేసుకోవడానికి రక్త పరీక్ష మాత్రమే మార్గం కాదు. అందుకు బదులుగా కొన్ని లక్షణాలు కనిపిస్తే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువ లేదా తక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు.
రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తాయి. ఎందుకంటే మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌ను తొలగించాలని కోరుకుంటాయి. అయితే యూరిన్ అధికంగా రావడంతో పాటు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే మూత్రంతో పాటు రక్తస్రావం కూడా కావచ్చు. అలాగే UTI లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. యూరిక్ యాసిడ్ సమస్య పెరిగినప్పుడు చాలా మందికి మూత్ర విసర్జన సమయంలో మంట వస్తుంది. ఎవరికైనా ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే.. అది వీపు కింద, పొట్ట దిగువ భాగంలో లేదా గజ్జల్లో నొప్పి కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినా జాగ్రత్తగా ఉండండి.
రాత్రి నిద్రపోతున్నప్పుడు పాదాలలో తీవ్రమైన నొప్పి ఉన్నా.. తేలికపాటి మంటగా అనిపించినా జాగ్రత్తగా ఉండటం అవసరం. పాదాల నొప్పి రాత్రి సమయంలో నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇది రక్తంలో పెరిగిన యూరిక్ యాసిడ్ కి సంకేతం కావచ్చు.
అంతేకాదు చర్మం గరుకుగా ఉండటం.. ఎప్పుడూ అలసటగా అనిపించినా, వికారం, తరచుగా వాంతులు, తరచుగా కండరాల తిమ్మిరి వంటి లక్షణాలు కనిపించినా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిన లక్షణాలు కావచ్చు.
Also read
- అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
- బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?
- షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..!
- ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
- నిడదవోలు నియోజకవర్గం – పట్టణ వివిధ వార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం





