మంచిర్యాల జిల్లా బొత్తపల్లిలో విషాదం చోటుచేకుంది. దసరా పండగ సందర్భంగా గ్రామంలో కోడి పందేలు నిర్వహించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మదనయ్య(42) కోడి కాలికి కత్తి కడుతుండగా పొరపాటున కత్తి మోచేతికి తగిలి.. నరం తెగడంతో ప్రాణాలు కోల్పోయాడు.
కోడి కాలికి కట్టిన కత్తి ఓ మనిషి ప్రాణాలను తీసింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా కన్నెప్పల్లి మండలం బొత్తపల్లిలో గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రాణం తీసిన కోడి కత్తి అయితే బొత్తపల్లిలో గ్రామంలో దసరా పండగ సందర్భంగా గుట్టుచప్పుడు కాకుండా ఊళ్ళో కోడి పందేలు నిర్వహించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మదనయ్య (42) కోడి కాలికి కత్తి కడుతుండగా అది ఒక్కసారిగా పైకి ఎగిరింది. దీంతో కోడి కాలికి కట్టిన కత్తి కాస్త అతని మోచేతికి తగిలి నరం తెగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. మార్గం మధ్యలోనే మదనయ్య ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరీశీలించారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025