October 17, 2024
SGSTV NEWS
LifestyleSpiritual

Navratri 2024: నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా.. ఆరోగ్యంగా ఉండేందుకు నిపుణుల సలహా ఏమిటంటే

నవరాత్రులలో ఉపవాసం చేసే సముయంలో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ అంటున్నారు. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మీ ఆరోగ్యం పాడవుతుంది. అటువంటి పరిస్థితిలో నవరాత్రులలో ఉపవాసం పాటించే సరైన పద్ధతుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నవరాత్రులలో ఉపవాసం ఎలా ఉండాలో నిపుణుల చెప్పిన సలహాలను గురించి తెలుసుకుందాం. వీటిని పాటించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది.


అమ్మవారిని పూజించే శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పండుగ 9 రోజులలో దుర్గాదేవిని వివిధ రూపాలను పూజిస్తారు. హిందూ మతంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన భారీ సంఖ్యలో అమ్మవారి భక్తులు దుర్గాదేవి పట్ల భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. ఉపవాసం చేయడం అనేది మతపరమైనది ఒక విధి మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనకరం.


నవరాత్రులలో ఉపవాసం చేసే సముయంలో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ అంటున్నారు. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మీ ఆరోగ్యం పాడవుతుంది. అటువంటి పరిస్థితిలో నవరాత్రులలో ఉపవాసం పాటించే సరైన పద్ధతుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నవరాత్రులలో ఉపవాసం ఎలా ఉండాలో నిపుణుల చెప్పిన సలహాలను గురించి తెలుసుకుందాం. వీటిని పాటించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది.

హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి
ఉపవాస సమయంలో తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నవరాత్రులలో ఉపవాస సమయంలో నీరు ఎక్కువగా త్రాగాలి. దీని వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వదు. కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది.


ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు

ఉపవాస సమయంలో చాలా మంది నూనెలో వేయించిన ఆహారాన్ని తింటారు. అయితే నూనె పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇవి గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి. ముఖ్యంగా మధుమేహం లేదా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఆయిల్ స్నాక్స్ తినకూడదు. దీనికి బదులుగా పండ్లు లేదా బత్తాయి వంటి వాటిని తినండి.

ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండకండి
కొంతమంది ఉపవాస సమయంలో ఎక్కువసేపు ఏమీ తినరు, త్రాగరు. అయితే ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రతి 2 నుంచి 3 గంటలకు ఏదో ఒకటి తింటూ ఉండండి. ఆకలితో ఉండటం వల్ల ఎసిడిటీ లేదా తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. దీంతో త్వరగా అలసట కూడా వస్తుంది.

ప్రోటీన్ ఫుడ్ తినండి
తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్స్ తినండి. తినే ఆహారంలో చీజ్, పెరుగు, పాలు, బాదం వంటి వాటిని చేర్చుకోండి. వీటిని తినడం వలన చాలా శక్తిని పొందుతారు ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. దీంతో కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది.

ఎవరు ఉపవాసం చేయకూడదంటే
మధుమేహం, రక్తపోటు, క్షయ, క్యాన్సర్ లేదా మరేదైనా తీవ్రమైన వ్యాధి ఉన్నవారు వరుసగా 9 రోజులు ఉపవాసం ఉండకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా 9 రోజులు ఉపవాసం ఉండకూడదు. అలాంటి వారు ఒకటి రెండు రోజులు ఉపవాసం ఉండాలనుకుంటే ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలి

Also read

Related posts

Share via