చీరాల : దసరా పండగ సందర్భంగా కళాశాలకు సెలవు దినాలు ప్రకటించడంతో సరదాగా అమ్మమ్మ ఇంటిలో గడిపేందుకు వచ్చిన బీటెక్ విద్యార్థిని పిడుగుపాటుకు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని పాత చీరాలలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం కురిసిన భారీ వర్షంలో మబ్బులు ఉరమటంతో సుమారు అరగంట పాటు భారీ వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో బాపట్లల లోని నరాల శెట్టి వారిపాలెంకు చెందిన నూతక్కి వెంకటేశ్వర్లు పార్వతీ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె నూతక్కి తులసి (20) బాపట్ల ఎన్టీఆర్ ఫుడ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.అయితే సెలవులు కావడంతో చీరాల అమ్మమ్మ ఇంటి వచ్చింది. వర్షం కురిసే సమయంలో ఆమె ఇంటిపై ఉండడంతో వర్షం కురుస్తూ మెరుపులు ఒక్కసారిగా రావడంతో పిడుగు పాటుకు విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రథమ చికిత్స చేయించి హాస్పటల్ కు తరలిద్దాం అనుకునే లోపే ఆమె మృతి చెందింది. సెలవుల పైన వచ్చిన తన మనవరాలు కళ్ళముందే పిడుగుపాటుకు మృతి చెందటంతో అమ్మమ్మ రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న తులసి తల్లిదండ్రులు బాపట్ల నుంచి చీరాలకు చేరుకున్నారు.బీటెక్ పూర్తిచేసుకునే మంచి ఉద్యోగం చేస్తోందని ఎంతో ఆశపడితే ప్రకృతి వైపరీత్యానికి తమ బిడ్డ మృత్యు ఒడికి చేరుకొందని తల్లిదండ్రుల రోధిస్తున్న తీరు చూపరులను సైతం కండతడి పెట్టించింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025