November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

Rajanna siricilla: రాజన్న సిరిసిల్లలో విషాదం.. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. ఏం జరిగిదంటే..



విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని వారు డిమాండ్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా  విద్యాధికారి రమేష్ వెంటనే స్పందించి స్కూల్ సీజ్ చేసినట్లు తెలిపారు.

బతుకమ్మ పండగ పూట ఆ ఇంట విషాదం నిండింది. సంబరాలకోసం ముస్తాబైన చిన్నారి అంతలోనే బస్ ప్రమాదంలో మృత్యువాతపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోనీ మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. నామపూర్ గ్రామానికి చెందిన సల్కం భూమయ్య- వెంకటవ్వ కూతురు మనోజ్ఞ (4సం) విద్యార్థిని మహర్షి పాఠశాల లో నర్సరీ చదువుతుంది. ఆ చిన్నారి ప్రతి రోజూలాగే ఉత్సాహంగా స్కూలుకు బయలుదేరింది. ఉదయం పూట నామాపూర్ గ్రామంలో బస్ ఎక్కిన మనోజ్ఞ అక్కడి నుండి స్కూల్ చేరుకుంది. అయితే స్కూల్ లో బతుకమ్మ సెలబ్రేషన్ ఉండడం తో అందుకు అనుగుణంగా రెడీ అయ్యి వచ్చింది.

ఉదయం స్కూల్ బస్ దిగిన క్రమంలో చిన్నారి జడలో పెట్టుకున్న పువ్వు కింద పడడంతో ఆ పువ్వును తీసుకోవడానికి కిందికి వంగింది.   అది గమనించని డ్రైవర్ వ్యాన్ ని ముందుకు తీస్తున్న సమయంలో విద్యార్థిని మను తల పై నుండి వ్యాన్ వెనుక టైర్లు వెళ్లడంతో తల నుజ్జు నుజ్జు అవ్వడం తో అక్కడికక్కడే మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పాప అప్పుడే తయారై వెళ్లిన తమ పాప చనిపోయిందని విషయం తెల్సిన తల్లి రోదనలు మిన్నంటడంతో అక్కడ  పాఠశాలలో అందరిని కలచి వేసింది. విషయం తెలుసుకున్న బందువులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. మాకు బస్ డ్రైవర్ ను అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితి అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆందోళన విరమించలేదు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకొని డిఎస్పీ చంద్రశేఖర్ వారిని సముదాయించి మీకు న్యాయం చేశారని హామీ ఇవ్వడంతో ఆందోళను విరమించించారు. అప్పటికే చేరుకున్న విద్యార్థి సంఘాలు విద్యార్థినికి న్యాయం చేయాలని, వెంటనే స్కూల్ సీజ్ చేయాలని ఆందోళన చేశారు. పాఠశాల కరస్పాండెంట్ విదేశాల్లో ఉండటం వలన పాఠశాలను పట్టించుకోకపోవడం వల్లనే ఇంతటి దారుణం జరిగిందని బంధువులు,  ఆరోపించారు. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడిన కుటుంబ సభ్యులు నష్టపరిహారం చెల్లిస్తామని బస్ కు ఇన్సూరెన్స్ ఉందని చెప్పడం తో ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు శాంతించారు.

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని వారు డిమాండ్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా  విద్యాధికారి రమేష్ వెంటనే స్పందించి స్కూల్ సీజ్ చేసినట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  వ్యాన్ డ్రైవర్, క్లీనర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share via