November 22, 2024
SGSTV NEWS
Andhra Pradesh

పండుగలు హిందువుల ఐక్యతకు దోహదపడుతాయి.


– విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ కార్యకారిణి సదస్యులు యక్కలి రాఘవులు.
వినాయక మండప నిర్వాహకులకు ఘన సత్కారం.
– విశ్వహిందూ పరిషత్, ఒంగోలు గణేష్ ఉత్సవ సమితి.



ఒంగోలు::

సమాజంలో హిందూ ధార్మిక శక్తిని, ఐక్యతను చాటడానికి పండుగలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని గమనించి స్వాతంత్ర్య ఉద్యమంలో భారతీయులందరినీ ఒకటిగ నిలపడానికి నాడు బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక ప్రతిమలను ప్రతిష్టింపజేసి సామూహిక పూజలతో పాటు దేశభక్తిని ప్రతి ఒక్కరిలో రగిలించడానికి కృషి చేశారని, ఈ గణేష్ మండపాల నిర్వహణతో స్వాతంత్ర ఉద్యమం లో స్వాతంత్రం సిద్ధించడానికి ఒక బలీయమైన కారణమైందని, అదే స్ఫూర్తి ప్రస్తుతం హిందువులలో హిందుత్వ భావనలు ద్విగుణీకృతం చేయడానికి వినాయక చవితి మండపాలు ఒక వేదిక కావాలని, మతమార్పిడులను తగ్గించడానికి, సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్క హిందువు పాటించడానికి వినాయక మండపాలు ఉపయోగపడుతున్నాయని, శ్రమను లెక్కచేయకుండా స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసినప్పటి నుండి తొమ్మిది రోజులు, 11 రోజులు, 21 రోజుల దాకా స్వామివారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ తమ తమ ప్రాంతాల్లో వాడవాడలా వినాయక చవితి పండుగను అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తున్న స్థానిక కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఇలాగే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక్కటిగా, ఐక్యంగా ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వ హిందు పరిషత్ కేంద్ర ప్రముఖ్ యక్కలి రాఘవులు పేర్కొన్నారు.

స్థానిక అంజయ్య రోడ్డు నందలి ఆంధ్రకేసరి విద్యా కేంద్రం లో విశ్వహిందూ పరిషత్ అనుబంధ శాఖ ఒంగోలు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో… విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుకుంట మల్లికార్జునరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన వినాయక మండప నిర్వాహకుల అభినందన సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన యక్కలి రాఘవులు సభను ఉద్దేశించి ప్రసంగించారు.

కార్యక్రమంలో నగరంలోని పలు డివిజన్ల నుండి విచ్చేసిన  80కి పైగా గణేష్ మండపాల నిర్వాహకులు 300 మందికి విశ్వహిందూ పరిషత్ గణేష్ ఉత్సవ సమితి ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల వారి సౌజన్యంతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పటిష్టమైన హిందూ ధార్మిక శక్తిని బలోపేతం చేస్తూ వినాయక మండపాల నిర్వహణకు కావలసిన అన్ని రకాల అనుమతులు ఒక పద్ధతిలో జరిగేలా చూడటం జరుగుతుందని గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ్ ప్రముఖు సోమ సుబ్బారావు తెలిపారు.

ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల ప్రతినిధులు శిఖాకొల్లి సాంబశివరావు, విహెచ్ పి జిల్లా కార్యదర్శి ఇనమనమెల్లూరి సీతారామయ్య, సహకార్యదర్శి ఈమని బలరాం, వ్యామిజాల ప్రసన్న కుమార్ శర్మ, కోశాధికారి సాధు శ్రీనివాసగుప్తా, భైరవేశ్వరానంద స్వామి, గడ్డం శ్రీనివాసులు, పసుమర్తి వెంకటేశ్వర్లు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, నేరెళ్ల శ్రీనివాసులు, సుంకు రఘు, చక్రధర రామానుజ పెరుమాళ్ళు, ప్రచార ప్రముఖ్ రాధా రమణ గుప్తా జంధ్యం, మద్దు అరవింద లక్ష్మి, చీమకుర్తి శివప్రసాద్, పి. శ్రీనివాసరావు, ఈదుల కృష్ణ తదితరులు కార్యనిర్వహణ చేశారు.

Also read

Related posts

Share via