తిరుపతి సిటీ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారి పై అత్యంత భక్తి విశ్వాసాలతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుడిగా వస్తున్నారని, దీనిపై కూటమి నాయకులు రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. పద్మావతిపురంలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ … లడ్డు వివాదం తగ్గుముఖం పట్టడంతో, కొత్తగా జగన్ డిక్లరేషన్ వివాదాన్ని నెత్తికెత్తుకుంటున్నారని, వాస్తవానికి జగన్ అనేకసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారని, ఐదుసార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు భక్తిశ్రద్ధలతో సమర్పించారని తెలిపారు. బిజెపి నాయకులు తామే హిందువులం అనే విధంగా వారి వైఖరి ఉందని, తాము చెప్పిన వారే హిందువులనేలా వారి తీరు ఉందని, వారి దగ్గర చెప్పించుకునే స్థాయిలో తాము లేమని సూచించారు. పోలీసులు ప్రభుత్వ పెద్దలు తమ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు భయపడబోం అని అన్నారు. ఎవరు ఎన్ని విధాలా అడ్డుకున్నా జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనాన్ని భక్తిశ్రద్ధలతో చేసుకొని, తిరుగు వెళతారని చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, భూమన అధినాయ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




