October 17, 2024
SGSTV NEWS
Crime

మహరాష్ట్రలోని థానే జిల్లాలో సంచలనం.. బద్లాపూర్‌ నిందితుడి ఎన్‌కౌంటర్‌..!

మహరాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌ స్కూల్‌లో క్లీనర్‌గా పని చేసే అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్ట్ 12న వాష్‌రూమ్‌కు వెళ్లిన నాలుగు, ఐయిదు సంవత్సరాల ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టాడు అక్షయ్ షిండే. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో అక్షయ్‌ను ఆగస్ట్ 17న పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే పోలీసుల దర్యాప్తులో తీవ్రమైన లోపాలపై ప్రజల నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ కు ఈ కేసు అప్పగించింది.

ఈ కేసు విచారణలో భాగంగా బాంబే హైకోర్టులో నిందితుడిని హజరు పర్చారు. తిరిగి వెళ్తుండగా పోలీసుల దగ్గర ఉన్న తుపాకీ లాక్కొని అక్షయ్ షిండే వారిపై కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపడంతో నిందితుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్షయ్ షిండే చనిపోయాడు. ఆత్మరక్షణ కోసమే నిందితుడిని పోలీసులు కాల్చి చంపారని సీఎం ఎక్‌నాథ్ షిండే క్లారిటీ ఇచ్చారు.

అక్షయ్ షిండే తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. పోలీసు కస్టడీలో ఉన్న తన కొడుకు చనిపోవడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. కస్టడీలో ఉన్న వ్యక్తి తుపాకీ ఎలా లాక్కుంటాడని ప్రశ్నిస్తోంది

Also read

Related posts

Share via