ములుగు జిల్లాలో వెలుగు చూసిన విచిత్ర క్షుద్రపూజలు స్థానికులను గజగజ వణికిస్తున్నాయి. చెట్టుకు చీర కట్టి తాంత్రిక పూజలు నిర్వహించిన గుర్తుతెలియని దుండగులు అక్కడ నల్లకోడిని నైవేద్యంగా సమర్పించి క్షుద్ర పూజలు నిర్వహించారు.
ములుగు జిల్లాలో వెలుగు చూసిన విచిత్ర క్షుద్రపూజలు స్థానికులను గజగజ వణికిస్తున్నాయి. చెట్టుకు చీర కట్టి తాంత్రిక పూజలు నిర్వహించిన గుర్తుతెలియని దుండగులు అక్కడ నల్లకోడిని నైవేద్యంగా సమర్పించి క్షుద్ర పూజలు నిర్వహించారు. ఆ విచిత్ర క్షుద్రపూజలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మనిషి కోరికలు అనంతం.. వింత వింత కోరికలు, సమస్యల పరిష్కారం కోసం ఈ మధ్య క్షుద్రపూజలు నయా ట్రెండ్‌గా మారాయి. జనం అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని క్షుద్రపూజలు జరిపే మూర్ఖులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అలాంటి మూర్ఖుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే కేటుగాళ్లు వింత వింత రూపాల్లో తాంత్రిక పూజలు నిర్వహించి ప్రజలను హడలెత్తిస్తున్నారు.
తాజాగా ములుగు జిల్లాలో వెలుగుచూసిన ఈ విచిత్ర క్షుద్ర పూజలు స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. వెంకటాపురం మండలం బెస్తగూడెం శివారులో రహదారి పక్కన క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోకి వెళ్లే మూల మలుపు వద్ద ఓ చెట్టుకి చీర కట్టి.. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. చెట్లుకు చీర కట్టి తాంత్రిక పూజలు నిర్వహించిన మాంత్రికులు అక్కడ నల్లకోడిని బలిచ్చారు. పూజలు నిర్వహించిన ప్రాంతంలో పసుపు కుంకుమ, నిమ్మకాయలు పేర్చి, కోడిని కోసి వదిలిపెట్టిన ఆనవాళ్లు స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లతో పాటు.. దాని చుట్టూ రక్తపు మరకలు ఉండటంతో అటుగా వెళ్లే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తరచూ ఇదే ప్రదేశంలో క్షుద్రపూజలు జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ విచిత్ర క్షుద్రపూజలు స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





