పల్నాడు జిల్లా (నరసరావుపేట) : వసతిగృహంలో 9వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జరిగింది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణం హార్డ్ హైస్కూల్ లో చదువుతున్న రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన 9 వ తరగతి విద్యార్థిని పల్లపు జయలక్ష్మి (14) వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2వ పట్టణ పోలీసులు వసతి గృహానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు పెదయలమంద, సుబ్బమ్మల ఫిర్యాదు మేరకు నరసరావుపేట రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025