జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విధి వక్రీకరించి యువకులకు దొరికాడు. ఇంకేముంది దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విధి వక్రీకరించి యువకులకు దొరికాడు. ఇంకేముంది దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అంతలో సదరు దొంగ మాత్రం తనకు ఆకలి అవుతుందంటూ కేకలు వేశాడు. దాంతో ఆ యువకులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు ఓ దొంగ. అయితే రోజు మాదిరిగానే ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేస్తున్న సమయంలో అలికిడి అయింది. అదే సమయంలో వినాయకుడిని నిమజ్జనం చేసిన యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు. అలికిడి శబ్దం విన్న ఆ యువకులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందని ఆ దొంగ కేకలు వేశాడు. దీంతో ఆ యువకులు వినాయక నిమజ్జనం కోసం తయారుచేసిన పులిహోరను దొంగకు తినిపించారు. దేహశుద్ధి చేసిన అనంతరం నార్కట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. దొంగను పోలీసులకు అప్పగించి కటకటాలపాలు చేసినప్పటికీ.. కొడితే కొట్టారు కానీ తన ఆకలిని తీర్చారంటూ ఆ దొంగ గ్రామస్తులకు దండం పెడుతూ కృతజ్ఞతలు తెలిపాడు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025