Karnataka Crime News:పెళ్లై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ పక్క దారి పట్టింది. ఓ యువకుడితో అక్రమ సంబంధం ఏర్పచుకుంది. ఈక్రమంలో ఎంతో అందంగా సాగిపోతున్న సంసార జీవితాన్ని నాశనం చేసుకుంది.
నేటికాలంలో మానవ సంబంధాలు మంటకలసి పోతున్నాయి. కొందరు ఆస్తుల కోసం రక్త సంబంధీకులను దారుణంగా హతమార్చుతున్నారు. అలానే మరికొందరు పరాయి శరీరంతో సుఖం కోసం ఇంట్లో వారినే చంపుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది మహిళలు శారీరక సుఖం కోసం కడుపున పుట్టిన పిల్లలను, కన్న తల్లిదండ్రులను సైతం కడతేర్చుతున్నారు. తాజాగా ఓ మహిళ పాడు బుద్ది..ఆమె కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేసింది. ఇంట్లో కూర్చొని ఉంటేనే నెలకు రూ.3 లక్షల అద్దె ఆ మహిళకు వస్తుంది. అయితే ప్రియుడి మోజులో పడి.. తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని బొమ్మన హళ్లి ప్రాంతంలో ఇటీవలే నాలుగు రోజుల క్రితం జయలక్ష్మి అనే 62 ఏళ్ల మహిళ ఇంట్లో చనిపోయింది. అయితే వెంటనే గమనించిన ఆమె కుమార్తె పవిత్ర(34) వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. తన తల్లికి రుతుచక్రం సమయంలో తీవ్ర రక్తస్రావమైందని వైద్యులతో తెలిపింది. ఇక జయలక్ష్మిని పరీక్షించిన వైద్యులు..ఆమె అప్పటికే మరణించినట్లు తెలిపారు. అయితే అదే సమయంలో ఆమె మృతిపై వైద్యులకు సందేహం కలిగి.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతురాలి కుమార్తెను అదుపులోకి తీసుకుని ప్రశ్నంచారు. ఇక పోలీసులు విచారణలోనూ వైద్యులకు చెప్పిన కథనే పవిత్ర చెప్పింది. దీంతో పోలీసులు జయలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం నివేదిక రావడంతో పోలీసులకు అసలు విషయం అర్థమైంది. జయలక్ష్మిని గొంతు నులిపడం వల్లే చనిపోయిందని, గొంతుపై చిన్న గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో ఉంది. దీంతో పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. మరోసారి మృతురాలి కుమార్తెను పిలిచి.. గట్టిగా ప్రశ్నించారు.
అయితే దొంగకు ధైర్యం ఎక్కువ అన్నట్లు..పోలీసులపైనే పవిత్ర తిరిగి ఫైర్ అయ్యింది. తన తల్లి చనిపోయిన బాధలో ఉంటే ఇలా విచారణ పేరుతో అవమానిస్తారా అంటూ ఎదురు ప్రశ్నించింది. అయినా పోలీసులు పట్టువిడవకపోవడం, తమదైన శైలీలో పవిత్రను అడగటంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాను, తన ప్రియుడు లవనీత్ తో కలిసి ఉండంగా.. జయలక్ష్మి చూసిందని, అంతేకాక చాలా సార్లు మందలించిందని తెలిపింది. ఈ క్రమంలోనే పవిత్ర, ఆమె లవర్ బాత్ రూమ్ లో నుంచి బయటచకు వస్తుండగా మరోసారి జయలక్ష్మి చూసింది. ఆ సమయంలో కూతుర్ని తీవ్రంగా హెచ్చరించింది. వారిద్దరి గురించి అందరికీ చెప్తానంటూ హెచ్చరించింది. అంతేకాక పవిత్ర ప్రియుడైన లవనీత్ ఇల్లు ఖాళీ చేయించింది.
ఇక తమ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని పవిత్ర భావించింది. అంతేకాక తన ఆనందానికి అడ్డుగా ఉన్న తల్లిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు పవిత్ర పోలీసుల విచారణలో తెలిపింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 11న పవిత్ర, ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి జయలక్ష్మిని టవల్ తో గొంతుకు చుట్టి హత్య చేశారు. ఇలా తాను చేసిన హత్య గురించి పవిత్ర పోలీసుల ముందుకు ఒప్పుకుంది. దీంతో ఆమెను, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇక పవిత్ర కుటుంబ విషయానికి వస్తే..ఆమెది ఎంతో అందమైన జీవితం. ఆర్థికపరమైన సమస్యలు లేవు. పవిత్ర సొంతమేనమామ అయిన సురేష్ ను వివాహం చేసుకుంది. వారికి 10 ఏళ్ల కూతురు, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వారికి మూడు అపార్టమెంట్లు ఉన్నాయి. వాటికి అద్దెలే నెలకు రూ.3 లక్షల వరకు వస్తాయి. వీరు ఉంటే భవనంలోనే ఓ ఇంట్లో లవనీత్ ఉంటాడు. అతడితో పవిత్రకు పరిచయం ఏర్పడి..అతికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. చివరకు 34 ఏళ్ల పవిత్ర..పాడుబుద్దితో తన జీవితాన్నే కాకా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇలా కేవలం పవిత్రే కాదు..నేటికాలంలో చాలా మంది మహిళు పరాయి వాడి సుఖం కోసం పచ్చని సంసారాన్ని నిట్టనిలువును కూల్చుకుంటున్నారు. ఐదు నిమిషాల సుఖం కోసం..అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
Also read
- Telangana: తస్మాత్ జాగ్రత్త..ఈ నెంబర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి.. చేశారో.. కొంప కొల్లేరే!
- రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య.. తాళ్లతో బంధించి చిత్ర హింసలు పెట్టి…..
- AP News: ఆయుర్వేదం చాక్లెట్ల పేరుతో ఇవి అమ్ముతున్నారు.. తిన్నారో..
- Andhra Pradesh: ఆమె సాఫ్ట్వేర్.. అతడు ఫుడ్ బిజినెస్.. ఇంతకీ రూమ్లో అసలు ఏం జరిగిందంటే..
- Telangana: మోజు తీరిన తరువాత అవౌడ్ చేశాడు.. పాపం ఆ యువతి.. వీడియో