SGSTV NEWS
Andhra PradeshCrime

గణేశ్‌ నిమజ్జన ఊరేగింపులో వైసీపీ పాటలు.. కేసు నమోదు..!

అన్నమయ్య : అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పోకనాటి వీధి వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైన కాసేపటికే డీజే సౌండ్‌ బాక్సుల్లో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైసీపీకి చెందిన పాటలు వేయడంపై బి. కొత్తకోటలో పోలీసులు కేసు నమోదు చేశారు. నిమజ్జనం ఊరేగింపు సమయంలో బస్‌ స్టాండ్‌ వద్దకు చేరుకోగానే వైసీపీ జెండాలతో పలువురు నేతలు నానా హంగామా చేశారు. అధికార తెలుగు దేశం పార్టీని అవమానించే రీతిలో నీకు 15 వేలు, నీకు 10 వేలు అంటూ మీమ్స్‌ ప్లే చేసిన వైనం ఏర్పడింది. స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
వినాయకుడి నిమజ్జన ఊరేగింపులో నిబంధనలకు విరుద్ధంగా పాటలు పెట్టి రెచ్చగొట్టారని నిర్ధారించిన పోలీసులు నిమజ్జన కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఇతరులను రెచ్చగొట్టేలా చేస్తే కఠిన శిక్ష విధిస్తామని పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

Also read

Related posts

Share this