టెంపుల్ సిటీలో స్పా మరక.. ఆధ్మాత్మిక నగరిలో డర్టీ పిక్చర్ కలకలం రేపింది.. తిరుపతిలో బ్రోతల్ దందాచేస్తోన్న స్పా సెంటర్లపై కొరడా తిరుపతి ఈస్ట్ పోలీసులు ఝులిపించారు. SEA 7 స్పా స్పెంటర్లో ముగ్గురు విటులను, నలుగురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో అసాంఘీక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ ఆదేశాలతో ఈస్ట్ తిరుపతిలోని 8 స్పాంటర్లపై పోలీసులు ఏకకాలంలో రెయిడ్ నిర్వహించారు. SEA 7 స్పా సెంటర్లో బ్రోతల్ రాకెట్‌ను బ్రేక్ చేశారు. ఢిల్లీ బ్యాచ్ ఈ దందాను నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సీ 7 స్పా సెంటర్ లో మేనేజర్‌గా పనిచేస్తున్న మనీషా.. స్పా ఆర్గనైజర్స్ మహీ ఆమె భర్త అఫ్తాబ్ లపై కేసు నమోదు చేశారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరున్నారో కూపీలాగుతున్నారు. స్పిరిచువల్ సిటీ తిరుపతి బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
స్పా, సెలూన్, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గతంలో అభియోగాలున్నాయి.. ఈ విషయంపై తిరుపతి ఎస్పీకి సైతం పలు ఫిర్యాదులు అందాయి.. ఈ నేపథ్యంలో ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ.. దాడులు నిర్వహించాలని ఆదేశించారు.. దీంతో స్పా మసాజ్ సెంటర్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది
తాజా వార్తలు చదవండి
- ‘ఎందుకు చంపావ్ నాన్నా..’ ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఆత్మహత్య
- మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన పసి ప్రాణం!
- దొంగలు బాబోయ్ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్ దొంగలు…
- బాలింత చితాభస్మంలో కత్తెర.. అంత్యక్రియలు పూర్తయ్యాక బూడిదలో గుర్తింపు
- రాడ్డుతో తలపై కొట్టి.. చెరువులో పడేసి..






Kolkata: కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. అలా ఎలా చేస్తారంటూ..