October 17, 2024
SGSTV NEWS
Andhra Pradesh

వృద్ధాప్యంలో తోడున్న కొడుకు మరణంతో జీవచ్ఛవంలా మారిన తల్లి.. చివరికి..!

నవ మోసాలు మోసి.. కని పెంచింది.. పెద్దవాడయ్యాక వృద్ధాప్యంలో తోడుగా ఉన్నాడు. ఈ సమయంలో కొడుకు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. తల్లడిల్లిన ఆ తల్లి గుండె కృంగిపోయింది.


బిడ్డను కంటికిరెప్పలా చూసుకునేదే అమ్మ. అమ్మంటే ప్రేమకు ప్రతిరూపం. మాటలకు అందని అనుబంధం. అందుకే అమ్మను మించిన దైవం లేదంటారు. ఆ తల్లి నవ మోసాలు మోసి.. కని పెంచింది.. పెద్దవాడయ్యాక వృద్ధాప్యంలో తోడుగా ఉన్నాడు. ఈ సమయంలో కొడుకు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. తల్లడిల్లిన ఆ తల్లి గుండె కృంగిపోయింది. ఆ తల్లి మంచాన పడింది. తీవ్ర వేదనతో అచేతనంలోకి వెళ్లి.. కొడుకు పెద్దకర్మ రోజే ప్రాణాలు విడిచింది ఆ తల్లి. అల్లూరి ఏజెన్సీ పాడేరులో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.


పాడేరు సినిమాహాల్ ప్రాంతానికి చెందిన వెంకయమ్మ కు పెద్ద కొడుకు వెంకటరమణ (62). అనారోగ్యం ఆగస్టు చివరి వారంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లి వెంకాయమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. మంచాన పడింది. అయితే, వెంకటరమణకు పెద్దకర్మ చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ఏర్పాట్లల్లో ఉండగా, వెంకాయమ్మ ఊపిరి వదిలింది. కొడుకు పెద్దకర్మ రద్దు చేసిన కుటుంబ సభ్యులు.. తల్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రోజుల వ్యవధిలోనే ఓకే కుటుంబంలో ఇద్దరు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు విలపించారు. ఆ గ్రామం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి.

Also read

Related posts

Share via