October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

అరకు లోయలో వేగంగా వస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసులు.. కట్ చేస్తే..!




అల్లూరి జిల్లాలోని అరకు ఏజెన్సీ ప్రాంతం. పోలీసులు ఓచోట కాపు కాశారు. వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ రెడ్ కలర్ కారు రయ్ మంటూ దూసుకువస్తోంది. కారు చూస్తే అనుమానాస్పదంగా కనిపించింది. నెంబరు AP 31JK 4174. అరకు వచ్చే పర్యాటకుల కారెమో అనుకున్నారు పోలీసులు. ఎక్కడో చిన్న అనుమానంతో కారు అపారు. నెంబర్ వెరిఫై చేశారు. కారు లోపల ఉన్న వారిని ప్రశ్నించారు. ఎక్కడో తేడా కొడుతుంది. వాళ్లు తెలుగు వాళ్ళు కాదు.. అలా అని ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. కారు నెంబర్‌కు వాళ్ళు చెబుతున్న పేర్లకు వివరాలకు పొంతన లేదు.. కట్ చేస్తే.. ఆ కారు కేరళ కు చెందినదిగా పోలీసులు గుర్తించి షాక్ అయ్యారు..!

అత్యంత చాకచక్యంగా గంజాయిని కేరళకు తరలించుకుపోతున్న స్మగ్లర్ల ఆట పట్టించారు అరకు లోయ పోలీసులు. 50 కేజీల గంజాయితో కారును సీజ్ చేశారు. అయితే కేరళ కారును ఆంధ్ర రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ పెట్టి తరలిస్తున్నట్టు గుర్తించి పోలీసులే అవాక్కయ్యారు. రాజధాని జంక్షన్ వద్ద పోలీసు తనిఖీల్లో కేరళకు చెందిన కారు ఆంధ్ర నెంబర్ తో గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని సిఐ హిమసాగర్ తెలిపారు. కేరళకు చెందిన స్మగ్లర్ సహ ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి కారు, సెల్ ఫోన్ కూడా సీజ్ చేశామని, వారి దగ్గర లభించిన రెండు లక్షల రూపాయల విలువైన గంజాయి సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు

Also read .

Related posts

Share via