మద్యానికి బానిస.. క్రైమ్స్ చేయడం అలవాటు.. ప్రస్తుతం నిందితుడిగా జైల్లో ఉన్నాడు. అయినప్పటికీ తన బుద్ది మార్చుకోలేదు. ఏకంగా మద్యం కొనివ్వాలంటూ పోలీసులతోనే ఘర్షణకు దిగాడు.
మదం తలకెక్కింది. రిమాండ్‌లో ఉన్నానన్న సోయి కూడా లేదు. మద్యం కావాలంటూ నానాయాగీ చేశాడు. జైలు సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టాడు. అతడిని అదుపు చేయడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. విశాఖ జైలు పరిసరాల్లో ఓ రిమాండ్ ఖైదీ ఓవరాక్షన్ చేశాడు. పెదజాలారిపేటకు చెందిన పతివాడ గౌరీశంకర్.. రౌడీ షీటర్. ఇతగాడిపై చాలా కేసులు ఉన్నాయి. ఓ మర్డర్ కేసులో రెండేళ్ల క్రితం జైలుకు వచ్చాడు. సోమవారం.. కోర్టు వాయిదా ఉండటంతో.. గాజువాకకు తీసుకెళ్లారు పోలీసులు. అక్కడ పని ముగిశాక తిరిగి జైలుకు తీసుకువస్తుండగా.. తనకు మద్యం ఇప్పించాలని పోలీసులతో గొడవకు దిగాడు. జైలు దగ్గరకు రాగానే.. అక్కడి సిబ్బందిపై దాడికి యత్నించాడు. ఎలాగోలా లోపలికి తీసుకెళ్లగా.. లోపల అద్దాలు ధ్వంసం చేశాడు. తనను తాను గాయపరుచుకున్నాడు.
దీంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి మళ్లీ జైలుకు తీసుకొచ్చారు. మద్యానికి బానిస అయిన గౌరీ శంకర్.. అది దొరక్కపోయేసరికి.. ఇలా ప్రవర్తిస్తున్నాడని.. కారాగార పర్యవేక్షణాధికారి ఎస్.కిషోర్‌కుమార్ తెలిపారు. అతని వల్ల తోటీ ఖైదీలకు ప్రమాదం పొంచి ఉందని.. అందుకు ప్రత్యేక సెల్‌లో ఉంచినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు చదవండి
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే