అది గుంటూరు శివారు ప్రాంతం.. అక్కడంతా కోలాహలంగా ఉంది. పోలీస్ సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. అక్కడ జరుగుతున్నా హాడావుడితో స్థానికులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వస్తున్న పోలీసులంతా మద్యం బాటిల్స్ తీసుకొస్తున్నారు.
అది గుంటూరు శివారు ప్రాంతం.. అక్కడంతా కోలాహలంగా ఉంది. పోలీస్ సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. అక్కడ జరుగుతున్నా హాడావుడితో స్థానికులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వస్తున్న పోలీసులంతా మద్యం బాటిల్స్ తీసుకొస్తున్నారు. వాటిని నేలపై వరుసగా పేర్చుతున్నారు. ఏంటా ఇదంతా అని స్థానికులు ఆసక్తికరంగా చూస్తుండిపోయారు. అలా.. కొద్దిసేపటికే జిల్లా ఎస్సీ సతీష్ కుమార్ అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే పచ్చ జెండా ఊపారు. ఇంకేంముంది… ఎక్సకవేటర్ నేలపై పేర్చిన మద్యం బాటిల్స్ పై నుంచి వెళ్లిపోయింది. మద్యం బాటిళ్లన్నింటిని ధ్వంసం చేసేసింది..
ఇదంతా ఏంటనుకుంటున్నారా.. ఏమి లేదండీ.. గత కొంతకాలంగా అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్స్ ను నిల్వ ఉంచుతూ వచ్చారు. అయితే, మద్యం బాటిల్స్ పెరిగిపోతుండటంతో వాటిని భద్రపర్చడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 24,000 వేల బాటిల్స్ ను గుంటూరు పోలీసులు ధ్వంసం చేశారు. 4,000 లీటర్స్ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి పన్నులు చెల్లించకుండా అక్రమంగా తీసుకొచ్చిన మద్యం బాటిల్స్ ను పోలీసులు ధ్వంసం చేశారు. ఈప్రక్రియను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు.
వీడియో చూడండి..
కాగా.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పాత మద్యం పాలసీనే కొనసాగుతోంది. కొత్త మద్యం పాలసీ ప్రకటించడానికి అనుకూలంగా ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు వచ్చే నెల నుండి కొత్త మద్యం పాలసీ ప్రకటించనున్నారు. ఈక్రమంలోనే పాత కేసుల్లో పట్టుకున్న మద్యం బాటిల్స్ ను పోలీసులు ధ్వంసం చేశారు.
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్హౌస్లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్