SGSTV NEWS
CrimeTelangana

Telangana: వట్టి నాగులపల్లిలో బాలుడు అదృశ్యం.. నీటి కుంటలో పడి మృతి

వట్టి నాగులపల్లి లో నిన్న అదృశ్యమైన విద్యార్థి కథ విషాదంగా ముగిసింది. మధ్యాహ్నం ఇంట్లో నుండి బయటకు వచ్చిన బాలుడు ఎంతకీ కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను వెతికారు తల్లిదండ్రులు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రాత్రి గడిచినా బాలుడి ఆచూకీ లభించలేదు. చివరకు ఓ నీటి కుంటలో బాలుడి మృతదేహం..

రంగారెడ్డి జిల్లా వట్టి నాగులపల్లి లో నిన్న అదృశ్యమైన విద్యార్థి కథ విషాదంగా ముగిసింది. మధ్యాహ్నం ఇంట్లో నుండి బయటకు వచ్చిన బాలుడు ఎంతకీ కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను వెతికారు తల్లిదండ్రులు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రాత్రి గడిచినా బాలుడి ఆచూకీ లభించలేదు. చివరకు ఓ నీటి కుంటలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.


బాలుడు మూడోవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటి కుంట లో పడిపోయాడు. ఈత రాకపోవడంతో గుంటలో మునిగి ప్రాణాలను విడిచాడు. గత కొంతకాలంగా ఇక్కడ నీటి ట్యాంకర్లు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ నిల్వ ఉండటంతో కుంటగా మారింది. కొందరు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా నీళ్లను అమ్ముకుంటున్నారని పలువురు మండిపడ్డారు

Also read

Related posts

Share this