October 18, 2024
SGSTV NEWS
Andhra PradeshSpiritual

వినాయక చవితి నవరాత్రుల్లో ముగ్గుల పోటీలు.

వినాయక చవితి నవరాత్రుల్లో ముగ్గుల పోటీలు.
పండుగను వర్ణమయం చేసిన సీతారామపురం మహిళలు.



ఒంగోలు::

నగర పాలక పరిధిలోని 27, 30 డివిజన్లో గల సీతారాంపురం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఆదివారం ముగ్గుల పోటీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు రంగవల్లులు దిద్ది గణపతి ఉత్సవాలను వర్ణమయం చేశారు సాయంత్రం ప్రముఖ బంగారు వర్తకులు నల్లమల్లి కుమార్ కుటుంబ సమేతంగా వినాయక మండపాన్ని సందర్శించి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. కార్యనిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన కమిటీ, మండప నిర్వాహకులు మాట్లాడుతూ బుధవారం మధ్యహాన్నం 12 గం.లకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని, ప్రజలందరూ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరారు.

Also read

Related posts

Share via