తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుత కలకలం సృష్టించింది. నగర శివారులో చిరుత పులి సంచారంతో జనం హడలిపోయారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఒక కార్యాలయం సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. చిరుత పులి అడుగుజాడలు సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
పులి సంచరించినట్టు సీసీ కెమెరా దృశ్యాలతో నిర్ధారణకు రావడంతో స్థానిక ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులతో పాటు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అధికారులు. చిరుత తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక పంచాయతీ అధికారులు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. చిరుత సంచారంపై రాజానగరం ప్రజలను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ. దివాన్ చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీరామ్‌పురం అటవీప్రాంతం వైపు చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు ఎమ్మెల్యే బత్తుల
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





