• నిందితుడికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
అవుకు: ఇంట్లో ఎవరూ లేని సమయం తెలుసుకున్న ఓ ప్రబుద్ధుడు తాగడానికి మంచినీళ్లు అడిగి… అదే అదునుగా మైనర్పై అత్యాచారం చేసిన ఘటన నంద్యాల జిల్లా, అవుకు మండల పరిధిలోని కాశీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీపురం గ్రామానికి చెందిన మైనర్ కోవెలకుంట్ల పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ప్రభుదాసు అనే వ్యక్తి ఇదే పాఠశాల వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
రోజూ బాలిక ఇదే వ్యాన్లో ఊరికి వచ్చేది. ఆదివారం బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరనే విషయం తెలుసుకున్న నిందితుడు ఇంటి వద్దకు వెళ్లి బాలికను..మీ నాన్న ఇంట్లోలేడా అని ໙໖໖.. తాగేందుకు మంచినీళ్లు తీసుకురమ్మన్నాడు. బాలిక ఇంట్లోకి వెళ్లగానే నిందితుడు తలుపులు వేసి బాలికనోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇంతలో బాలిక తల్లి ఇంటికి తిరిగి వచ్చి గేటు తీసింది. గేటు శబ్దం విన్న నిందితుడు బాలికను బెదిరించి మంచం కింద దాక్కున్నాడు. అప్పటికే భయాందోళనగా ఉన్న బాలిక తలుపులు తెరవగానే చెంపపై కాట్లు ఉండటంతో తల్లి ప్రశ్నిస్తూనే నిందితుడిని గమనించింది. దీంతో కేకలు వేయగా, చుట్టుపక్కల వారు, బంధువులు బాలిక ఇంటికి వచ్చి నిందితుడిని కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు చదవండి
- పల్నాడు జిల్లాలో యువకుడు కిడ్నాప్!
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..