• విషయం తెలుసుకొని కల్యాణ మండపానికి చేరుకున్న వైనం
• అప్పటికే పూర్తయిన తంతు
• ఇరువర్గాల గొడవ
• పోలీస్టేషన్ కు చేరిన వ్యవహారం
కావలిలోని కచ్చేరిమిట్ట కాలనీలో నివాసం ఉంటున్న అరుణకుమారి, విజయ్ కుమార్ దంపతుల కుమార్తె నీలిమతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో వీరు 2012లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి కెవిన్ రూబెన్, స్టెపానీ గోల్డ్ పిల్లలు. ఈ క్రమంలో గ్రామంలో మీ సేవ, ఆన్లైన్ సెంటర్ ను కొంతకాలం నిర్వహించారు. అనంతరం దంపతుల నడుమ ఏర్పడిన విభేదాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. పెద్దల సమక్షంలో రాజీ చేసుకొని ఇటీవల నుంచి సఖ్యతగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగమంటూ రూబేను హైదరాబాద్ వెళ్లారు. అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు భార్య, పిల్లలను నమ్మించారు. కావలి కోర్టులో ఉద్యోగం చేస్తున్న నీలిమ అక్కడే ఉంటూ పిల్లలను చూసుకోసాగారు.
ఫోన్ నంబర్ బ్లాక్
నిత్యం భార్యాపిల్లలతో ఫోన్లో మాట్లాడే రూబేను అకస్మాత్తుగా నీలిమ నంబర్‌ను బ్లాక్ చేశారు. కోర్టు విధులకు శుక్రవారం హాజరైన నీలిమ.. రూబేనుకు కందుకూరులో మరో వివాహం జరుగుతోందనే విషయాన్ని పాస్టర్ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే పిల్లలు, బంధువులతో కలిసి వివాహం జరుగుతున్న ఎస్వీఎస్ కల్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకునేసరికే భర్త రెండో వివాహం పూర్తయిపోయింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రూబేనును స్టేషన్‌కు తరలించారు.
పేరు మార్చుకొని..
వివాహం కోసం తన పేరును ఆదర్శ్ గా మార్చుకొని కందుకూరు మండలం కోవూరుకు చెందిన శ్రీవాణిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్య వచ్చి బండారం బయటపెట్టడంతో పెళ్లి వివాదంగా మారింది. దీంతో శ్రీవాణిని ఆమె తరఫు బంధువులు ఇంటికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు చదవండి
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!