Three Days Holidays For Gudlavalleru College Students: గుడ్లవల్లేరు కళాశాల ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ జరిగిన ఓ ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసింది. విద్యార్థినీలు ఉండే వసతి గృహంలోని వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి..వీడియోలు తీశారనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపైన నిరసన తెలియజేస్తూ..కాలేజీ విద్యార్థినులు నిరసనలు చేస్తున్నారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థినుల నిరసనలకు ఏబీవీపీ వంటి విద్యార్థి సంఘాలు మద్దతుగా వచ్చారు. అసలు విచారణ కూడా చేయకుండా అసలు కమెరాలే లేవు అంటూ కొట్టి పారేస్తున్నారు అంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరగాలని.. సరైన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక విద్యార్థినుల నిరసనలు ఉద్దృతం కావడంతో గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. విద్యార్థినులు ఆందోళన బాట పట్టడం, వారికి మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన యాజమాన్యం గ్రహించింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజులు సెలవులు ప్రకటిస్తూ తీసుకుంది. కాలేజీ యాజమాన్యం సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్నారు. వాష్ రూమ్ లో వీడియోలు చిత్రీకరించినట్లు వార్తలు రావడంతో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలానే ఈఘటనకు సంబంధించిన కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలా ఒకవైపు నిందితుడి విచారణ జరుగుతుండగానే.. కాలేజీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి గుడ్లవల్లేరు కాలేజీకి చెందిన విద్యార్థునులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటన మూడ్రోజుల క్రితమే తమ దృష్టికి వచ్చింది అంటూ విద్యార్థినులు వార్డెన్ తో చెప్పారు. అలాగే పోలీసులు, అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ విషయాలపై అధికారులు కూడా స్పందించి..సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా గుడ్లవల్లేరు కాలేజీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి..తాజాగా గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం తీసుకున్న సెలవుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం