దేశంలో ఆడవారికి రక్షణ లేకుండాపోతోంది. ఒకవైపు కోల్‌కతా ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మరువకముందే.. దేశం నలుమూలల మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో మరో షాకింగ్ ఘటన ఒకటి నోయిడాలో వెలుగు చూసింది. సెక్టార్ 94లో ఉన్న ఓ పోస్టుమార్టం హౌస్‌లో.. అందులో పనిచేసే ఉద్యోగి ఒకరు.. మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ నీచపు పనిని మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. కాగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఒక నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
వైరల్ వీడియో ప్రకారం.. మార్చురీలోని డీప్ ఫ్రీజర్ రూమ్‌లో ఓ వ్యక్తి మహిళను లోబర్చుకున్నట్టు మీరు చూడవచ్చు. ఆమెతో అతడు అభ్యంతరకరమైన స్థితిలో కనిపించగా.. ఈ వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి.. తర్వాత తన వంతు అని చెప్పడం మీరు గమనించవచ్చు. ఈ ఇద్దరు నిందితులు మృతదేహాలను డీప్ ఫ్రీజర్‌లో భద్రపరిచే గదిలో ఈ నీచపు పనికి పాల్పడ్డారు. ఇక మార్చురీలో ఎలాంటి మహిళా ఉద్యోగి విధులు నిర్వర్తించకపోవడంతో.. ఆ మహిళ అక్కడికి ఎలా వచ్చిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి
కాగా, పోస్టుమార్టం హౌస్‌లో స్వీపర్ కాంట్రాక్ట్‌పై పని చేస్తుండగా.. అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోస్టుమార్టం హౌస్ ఇన్ఛార్జ్ డాక్టర్ జైసాలాల్ తెలిపారు. ఈ ఘటనపై నోయిడా డీసీపీ స్పందిస్తూ.. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. పోలీస్ స్టేషన్ సెక్టార్-126లో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




