October 16, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

వైద్యుల నిర్లక్ష్యానికి బేబీ మృతి..ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు.. వీడియో

అన్నమయ్య జిల్లా మదనపల్లె  …వైద్యుల నిర్లక్ష్యానికి ప్రయివేట్ ఆసుపత్రిలో ఓ బేబీ మృత్యువాత పడింది. తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి మదనపల్లె రెయిన్ బో ఆస్పత్రి వద్ద జరిగిన ఘటనపై వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చేలురికి చెందిన దంపతులు శంకర, లలిత లు తన మూడు నెలల పురిటి బిడ్డను తీసుకొని ఆస్పత్రికి వచ్చారు. డాక్టర్ లేకపోయినప్పటికీ ఆసుపత్రిలో రక్త పరీక్షలు, వివిధ రకాల టెస్టల పేరుతో కాలయాపన చేశారు. ఆ సమయంలో డాక్టర్ లేకపోవడం, డాక్టర్ ఆలస్యంగా వచ్చినా బేబీకి డాక్టర్ వైద్యం అందించక పోవడంతో హాస్పిటల్ లోనే డాక్టర్ ల నిర్లక్ష్యానికి పసికందు కన్ను మూసింది. దీంతో మృతుని తల్లిదండ్రులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ బిడ్డ మరణానికి వైద్యలే కారణమని ఆసుపత్రి వద్ద బైఠాయించి తమ బిడ్డను అన్యాయంగా పట్టణ పెట్టుకున్నారని నిరసనకు దిగి ఆందోళన చేపట్టడంతో వివాదం నెలకొంది. ఈ విషయమై డాక్టర్ మాట్లాడుతూ… బేబీని బతికించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసామన్నారు. డాక్టర్లు ఒక ప్రాణాన్ని బతికిస్తారని తీయరని, బిడ్డ మృతిలో తమ తప్పేమీ లేదని డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు.



Also read

Related posts

Share via