SGSTV NEWS
Andhra PradeshCrime

పాఠశాలలోనే బాలికపై అత్యాచారం

తిరుపతిలోని ఓ పాఠశాలలో బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలోని ఓ ప్రభుత్వ బాలికల వసతి, పరిశీలన గృహంలో ఉంటూ ఓ బాలిక (14) తొమ్మిదో తరగతి చదువుతోంది.

తిరుపతి : తిరుపతిలోని ఓ పాఠశాలలో బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలోని ఓ ప్రభుత్వ బాలికల వసతి, పరిశీలన గృహంలో ఉంటూ ఓ బాలిక (14) తొమ్మిదో తరగతి చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సత్యవేడు మండలం కన్నవరానికి చెందిన రుషి (40) పాఠశాలలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసిన తిరుపతి వెస్ట్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్ కు సరకులు సరఫరా చేసే నిందితుడు బాలికతో పరిచయం ఏర్పరచుకుని అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఘటన బుధవారమే జరిగినా వసతి గృహం అధికారులు గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

టీచర్ ఆరా తీయడంతో బయటపడ్డ వైనం

బాలిక ప్రవర్తన వింతగా ఉండడంతో క్లాస్ టీచర్కు శుక్రవారం అనుమానం వచ్చింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు.. ఆరోగ్యం సరిగా లేదా? అంటూ   ప్రశ్నంచిoది . బాలిక ఏం లేదంటూనే ఏడవడంతో టీచర్ కు అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారుదీంతో జరిగిన విషయాన్ని పూర్తిగా తెలిపింది. వెంటనే టీచర్ ప్రభుత్వ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్కు సమాచారం అందించారు. సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు

Also read

Related posts