*
అమరావతి:
22.8.24 గురువారం *బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ* ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీవీ5 మూర్తి తమను ఐదు కోట్లు అడిగాడని ఈ నకిలీ జ్యోతిష్యుడు వేణు స్వామి అసత్య ఆరోపణలపై వివాదం నెలకొని ఉన్నది, దానిపైన అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వేణు స్వామి అతని భార్య ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తమకు అండగా బ్రాహ్మణ సమాజ మద్దతు ఇవ్వాలని, జర్నలిస్టులు మద్దతు ఇవ్వాలని, చదువుకున్న వారు మద్దతు ఇవ్వాలని సోషల్ మీడియాలో బహిరంగంగా వేణు స్వామి దంపతులు కోరిన నేపథ్యంలో హైదరాబాదులో నివసించే పరాశరం
వేణు అనే నకిలీ జ్యోతిష్యుడు, యూట్యూబర్ బ్రాహ్మణుడు కాదనీ, బ్రాహ్మణ కులానికి అతనికి ఎటువంటి సంబంధం లేదనీ, అతని కులం బీసీ సామాజిక వర్గంలో ఉన్న చాత్తాద శ్రీ వైష్ణవ కులమనీ, అతను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తనీ, బ్రాహ్మణ సామాజిక వర్గంలో అతను జన్మించలేదనీ, వారి పూర్వీకులు గుంటూరు జిల్లా, తెనాలి దగ్గర మంచికలపూడి గ్రామంలో సాతాను అంటే చాత్తాద శ్రీ వైష్ణవ కులానికి సంబంధించిన వారి వారి కులవృత్తి నిర్వహించేవారనీ, అతను బ్రాహ్మణ కులంలో వుండే వైఖానస శాఖకు సంబంధించిన వ్యక్తిననీ కొంతకాలం, శ్రీ వైష్ణవ శాఖకు సంబంధించిన వ్యక్తినని కొంతకాలం అతని యూట్యూబ్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అయితే అతను బీసీ సామాజిక వర్గంలో ఉన్న ఉపకులాల్లో చాత్తాద శ్రీవైష్ణవ కులం అనేది ఈ రోజున మా విచారణలో తెలిసినది. అందువల్ల అతను బ్రాహ్మణుడు కాదు. అతను చేసే మోసపు పనులకు, మోసపు జ్యోతిష్యానికి, బ్రాహ్మణ జాతికి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ వారు, సభ్య సమాజంలో మిగిలిన ప్రజలు అతనిని నమ్మి ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా నష్టపోవద్దు. అతని వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీమీ ప్రాంతాల్లో అతనిపై చట్ట ప్రకారం పోలీస్ కేసులు పెట్టవలసిందిగా బ్రాహ్మణ చైతన్య వేదిక సభ్య సమాజానికి విజ్ఞప్తి చేస్తుంది. అతను తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్నాడు కాబట్టి స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి మోసగాళ్లకు అడ్డుకట్ట వేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి శబరి శర్మ, వడ్లమూడి రాజా, చిలుమూరు ఫణి శర్మ, వంగవీటి చైతన్య శర్మ, వడ్డమాను ప్రసాదు శర్మ తదితరులు పాల్గొన్నారు.
*సిరిపురపు శ్రీధర్ శర్మ*,
రాష్ట్ర అధ్యక్షుడు
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం