ఒరిస్సా మల్కాన్‌గిరి జిల్లా నుంచి కారులో 20.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ ధూల్‌పేట్‌కు తీసుకువస్తున్న సమాచారాన్ని అందుకున్న ఎక్సైజ్ అధికారులు గంజాయిని పట్టుకున్నారు. ధూల్‌పేట్‌లోని నయన్‌దాసు, (బిక్కు) సాహిల్‌సింగ్, అభిషేక్‌సింగ్, అదర్స్ సింగ్‌లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం మారుతీ కారును వినియోగించారు. ఈ ఆపరేషన్‌లో మారుతీ కారుతో సహా 20.8 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఒరిస్సా మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయిని తీసువస్తున్నారనే సమాచారం తెలుసుకున్న పోలీసులు చామన్మండి, సీతారాంబాగ్ దేవాలయం సమీపంలో కాపుకాపుకాశారు. కారు బంపర్ల కిందదాపెట్టిన గంజాయిని బయటకు తీసి తూకం వేయగా 20.8 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన రాహుల్ సనా, జయదేవ్దాసు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కారుతో పాటు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తీసుకవచ్చిన ఇద్దరితో పాటు కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ అంజి రెడ్డి తెలిపారు
Also read
- Hyderabad: పీజీ డాక్టర్.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు.. సీన్ కట్ చేస్తే..
- అయ్యో అయాన్.. చిన్నారిని అంగన్వాడీకి పంపిస్తే నిర్లక్ష్యంతో చంపేశారు..
- Telangana: ఆడితే దండిగా డబ్బులు వస్తాయంటారు.. కట్ చేస్తే.. చివరికి చచ్చేది మనమే
- అడవి పందిని వేటాడేందుకు వెళ్లాడు.. కట్ చేస్తే.. ఆపై కాసేపటికే
- పైకి చూసి ఇతను ఎంత అమాయకుడో అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్





