October 16, 2024
SGSTV NEWS
Andhra Pradesh

పర్యావరణ సమతుల్యత తోనే  దేశ భవిష్యత్.
– ఏకేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మూర్తి.

పర్యావరణ సమతుల్యత తోనే  దేశ భవిష్యత్.
– ఏకేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మూర్తి.

ఒంగోలు::

పర్యావరణ సమతుల్యత తోనే దేశ భవిష్యత్ ముడిపడి ఉందని, అందుకోసం పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు సైతం విరివిగా పాల్గొని దేశ భవిష్యత్ ను కాపాడాలని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి అన్నారు. శుక్రవారం ఆంధ్ర కేసరి యూనివర్శిటీ లోని ఆయన ఛాంబర్ లో ప్రొఫెసర్ మూర్తి మాట్లాడారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీకి ఎన్.ఎస్.ఎస్.తరుపున ప్రస్తుతం 59 యూనిట్లు మంజూరు కాగా, అందుకు సంభంధించిన పత్రాలను ప్రొఫెసర్ మూర్తి ఏ.కే.యూ.ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ డాక్టర్ మండే.హర్ష ప్రీ తం దేవ్ కుమార్ కు అందజేశారు. పర్యావరణ కాలుష్యమును నివారించి సమతుల్యతను కాపాడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన డాక్టర్ హర్షకు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్ష ప్రీతం దేవ్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ఎన్.ఎస్.ఎస్. యూనిట్లను నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్శిటీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ఎన్.ఎస్.ఎస్.అధికారి కే.చంద్రమౌళి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. తొలి విడతలో మొత్తం 59 యూనిట్లు మంజూరు అయ్యాయని ఆయన చెప్పారు. రెండో విడతలో మరో 50 యూనిట్లు మంజూరు కావాల్సి ఉందని అన్నారు. ఎన్.ఎస్.ఎస్.ద్వారా సామాజిక చైతన్యం, గ్రామీణ అభివృద్ధి, మొక్కల పెంపకం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, నిరక్షరాస్యత నిర్మూలన, వృద్ధుల సంక్షేమం స్వచ్ఛ భారత్, విద్యా విజ్ఞానాన్ని అందించడంలో అట్టడుగు వర్గాల ప్రజలతో మమేకమై వారిలో చైతన్యాన్ని నింపడం,వర్షపు నీటిని వడిసి పట్టి, ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించే విధంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని డాక్టర్ మండే. హర్ష ప్రీతం దేవ్ కుమార్ తెలిపారు.

Also read

Related posts

Share via