భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. వృద్ద దంపతులు నిమిషాల వ్యవధిలో మృతి చెందటం ఆ కుటుంబాన్ని కలచి వేసింది. మణుగూరులో నివాసముండే కొమ్ము సోమయ్య తన వ్యవసాయ పొలంలో పనులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో పొలంలోనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. మధ్యాహ్నం దాటిన భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కొమ్ము శంకరమ్మ, అతని కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఇంటికి సోమయ్య మృతదేహం చేరుకోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది.
భర్త సోమయ్య మృతి చెందడంతో తట్టుకోలేని శంకరమ్మ నిమిషాల వ్యవధిలోనే గుండెపోటుకు గురై కుప్పకూలిపోయింది. వెంటనే బంధవులు ఆమెను హాస్పిటల్కు తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్ తెలిపారు. దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం మరింత కుంగిపోయింది. వీరికి ముగ్గురు కుమారులు అంతా వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. మణుగురు లో అంటూ వ్యవసాయ పనులు చూసుకునే దంపతులు ఇద్దరూ ఇలా గంట వ్యవధిలోనే చనిపోవడంతో అందరిని కలచివేసింది.
ఒకరి తరువాత ఒకరు వృద్ధ దంపతులు మృతిచెందడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే సోమయ్య – శంకరమ్మ దంపతుల మృతితో వారు నివాసముండే బాలాజీ నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి, వృద్ధ దంపతుల మృతదేహాలను చూసి బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





