February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

అనుమానంతో భార్యను చంపి.. ఉరేసుకున్న భర్త

భార్యపైన అనుమానంతో ఆమె గొంతు కోసిన భర్త ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్లో చోటుచేసుకుంది.

నారాయణపేట జిల్లా కృష్ణా మండలం, : భార్యపైన అనుమానంతో ఆమె గొంతు కోసిన భర్త ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్లో చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. తంగడి తిమ్మప్ప(26)కు కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా బాడ్యాలకు చెందిన సంధ్య(21)తో ఈ ఏడాది ఏప్రిల్ 18న వివాహం జరిగింది. భార్యపైన తిమ్మప్పకు అనుమానం ఉండటంతో కొద్దిరోజులకే ఆ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇద్దరి మధ్య బుధవారం మాటకు మాట పెరగడంతో ఆవేశానికి గురైన భర్త తలుపు గడియపెట్టి కత్తితో భార్య గొంతు కోయడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. అక్కడే తిమ్మప్ప ఉరేసుకున్నాడు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన సంధ్య అతికష్టంపై ఇంటి తలుపు గడియ తీసి బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్తపుమడుగులో ఆమె పడి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ప్రాణం కోల్పోయి వేలాడుతున్న తిమ్మప్ప శవం కనిపించింది. సంధ్యను వెంటనే కర్ణాటకలోని రాయచూరు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కృష్ణా ఎస్ఐ) ఎస్ఎం నవీద్ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి    చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు.

Also read

.

Related posts

Share via