ప్రపంచంలో అధర్మం, పాపం పెరినప్పుడు ధర్మ స్థాపన కోసం విష్ణువు భూమి మీద కృష్ణుడిగా అవతరించినందుకు చేసుకునే పండగ. ద్వాపరయుగంలో కంసుని అరాచకాలు భూమ్మీద పెచ్చుమీరినప్పుడు అతని నుంచి ప్రజలను విముక్తి చేయడానికి శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో ఎనిమిదవ సంతానంగా మధురలోని చెరసాలలో జన్మించాడు. జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది.
కృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది శ్రీ మహా విష్ణువు 10 అవతారాలలో ఎనిమిదవ అవతారం.. ఇరవై నాలుగు అవతారాలలో ఇరవై రెండవది అయిన శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకునే వార్షిక హిందూ పండుగ. కృష్ణ జన్మాష్టమి హిందూ మతంలో ముఖ్యమైన పండుగగా పరిగణించబడుతుంది.. మన దేశంలోని హిందువులు మాత్రమే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాలలో కన్నయ్య భక్తులు వైభవంగా కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. శ్రీకృష్ణుని భక్తులు ఈ రోజు కోసం ఏడాది పొడవునా ఎంతో ఇష్టంగా ఎదురుచుస్తారు.
ప్రపంచంలో అధర్మం, పాపం పెరినప్పుడు ధర్మ స్థాపన కోసం విష్ణువు భూమి మీద కృష్ణుడిగా అవతరించినందుకు చేసుకునే పండగ. ద్వాపరయుగంలో కంసుని అరాచకాలు భూమ్మీద పెచ్చుమీరినప్పుడు అతని నుంచి ప్రజలను విముక్తి చేయడానికి శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో ఎనిమిదవ సంతానంగా మధురలోని చెరసాలలో జన్మించాడు. జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని చెబుతారు. జన్మాష్టమి రోజున కూడా జయంతి యోగం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో, జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండటం ద్వారా శాశ్వతమైన పుణ్యాన్ని పొందవచ్చు. శ్రీకృష్ణునికి శరణాగతిని కోరిన వారు మృత్యులోకములో స్వర్గము వంటి సుఖములను పొందుతారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలో తెలుసుకుందాం.
కృష్ణ జన్మాష్టమి తిథి 2024:
ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 3.39 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీమర్నాడు ఆగస్టు 27 మధ్యాహ్నం 2:19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో 26 ఆగస్టు 2024న కృష్ణ జన్మాష్టమి ఉపవాసం చేస్తారు.
ఈ సంవత్సరం 2024 జన్మాష్టమి ఎప్పుడంటే:
ఈ సంవత్సరం 2024లో జన్మాష్టమి ఆగస్టు 26, 27 తేదీలలో జరుపుకోనున్నారు. ఉదయ తిథి ప్రకారం ఆగస్టు 26న జన్మాష్టమి వ్రతం జరుపుకుంటారు. అదే సమయంలో ఆగస్టు 27న గోకులం, బృందావనాలలో కృష్ణ జన్మోత్సవాన్ని నిర్వహించనున్నారు.
జన్మాష్టమి ప్రాముఖ్యత
శ్రీకృష్ణుని బాల రూపాన్ని జన్మాష్టమి రోజున పూజిస్తారు. జన్మాష్టమిని శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిధి రోజున జరుపుకుంటారు. ఈ తేదీన కృష్ణుని జన్మదినం సందర్భంగా, దేవాలయాలలో వివిధ ప్రదేశాలలో కీర్తనలు, భజనలు చేస్తారు. రాత్రి 12 గంటల వరకు ఉపవాసం ఉండి స్వామివారికి సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. తర్వాత మర్నాడు ఉదయం నుంచి నంద మహోత్సవాన్ని జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున శ్రీకృష్ణుని లడ్డూ గోపాల రూపాన్ని లేదా బాల గోపాల రూపాన్ని పూజించడం వల్ల ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుందని విశ్వాసం. అలాగే శ్రీకృష్ణుని అనుగ్రహంతో కోరిన కోర్కెలు నెరవేరి..ఏడు జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతే కాదు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.
జన్మాష్టమి ఎలా జరుపుకుంటారు?
ఈ రోజున శ్రీకృష్ణుని భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రి సమయంలో శ్రీకృష్ణుని పూజిస్తారు. స్వామికి పసుపు, పెరుగు, నెయ్యి, గంగాజలం మొదలైన వాటితో స్నానం చేయించి తర్వాత చందనం పూస్తారు. భక్తీ పారవశ్యంతో కీర్తిస్తారు. అనంతరం శ్రీ కృష్ణుడి ఆలయాలను అందంగా అలంకరించి భజనలు, కీర్తనలు చేస్తారు. ఈ రోజున శ్రీమద్ భగవత్ పారాయణం కూడా జరుగుతుంది.
మధుర-బృందావనాలలో జన్మాష్టమి
జన్మాష్టమి పండుగను మధుర, బృందావన ప్రదేశాలలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ-కృష్ణ హరే హరే అని జపిస్తారు. జన్మాష్టమి పండుగ తర్వాత మరుసటి రోజు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
వైష్ణవ, శైవ సమాజాల్లో జన్మాష్టమి
వైష్ణవులు: శ్రీకృష్ణుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు. కన్నయ్య పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటారు.
శైవులు: శైవ వర్గానికి చెందిన ప్రజలు కూడా జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. అయితే వైష్ణవుల వలె వైభవంగా జరుపుకోరు.
శ్రీ కృష్ణ మంత్రాలు
క్రీం కృష్ణాయ నమః
ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ విద్మహే తన్నో కృష్ణ:ప్రచోదయ
ఓం క్లీం కృష్ణాయ నమః
ఓం గోకుల నాథయ నమః