ఈమధ్య స్పీడ్ పెంచిన ఏసీబీ అధికారులు లంచాలకు రుచి మరిగిన అవినీతి అధికారులపై కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఎస్ఐ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇందుకు సహకరించిన కానిస్టేబుల్స్ తోసహా ఆ ఎస్ఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్ఔఐ లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. పోలీస్ స్టేషన్ లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్కయ్యాడు. గూగులోతు వెంకన్న అనే ఎస్ఐ, ఓ కేసు విషయంలో బదావత్ భాస్కర్ అనే వ్యక్తి వద్ద నుండి 40 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవల గుడుంబా తయారీ కోసం ఓ వాహనంలో బెల్లం తరలిస్తున్న క్రమంలో పోలీసులు భాస్కర్ ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ కేసు విషయంలో పట్టుబడ్డ వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ వెంకన్న 70 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. తొలుత 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ఎస్ఐకి చెల్లించగా, మరో 40 వేల రూపాయల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ తతంగంలో ముందు నుంచి సహకరించిన ఎస్ఐ డ్రైవర్ సదానందాన్ని సైతం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
లంచం ఇవ్వడం ఇష్టం లేకే భాస్కర్ అనే బాధితుడు తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. అతని ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో ఎస్ఐని అరెస్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..