October 17, 2024
SGSTV NEWS
Andhra Pradesh

AP News: అడవిలో దొరికిన గుడ్లను తీసుకొచ్చి కోడితో పొదిగించాడు… కట్ చేస్తే…

అల్లూరి ఏజెన్సీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ గిరిజనుడు అడవిలోకి వెళ్లడంతో.. అక్కడ కొన్ని గుడ్లు కనిపించాయి. భలే ఉన్నాయిలే అనుకొని.. తీసుకొచ్చి తన దగ్గర పెంచుకుంటున్న కోడిపెట్ట కింద పొదగడానికి పెట్టాడు. దాదాపు 3 వారాల తర్వాత…..

Also read :Pakistan: పరువు తీస్తోందని కుమార్తె కాళ్లు నరికేసిన తండ్రి.!

అల్లూరి జిల్లా ఏజెన్సీలో అరుదైన ఘటన కనిపించింది. కోడి పెట్టకు నెమలి పిల్లలు తోడయ్యాయి. నెమలి గుడ్లను కోడిపెట్ట పొదగడంతో.. ఆ గుడ్ల నుంచి ఐదు నెలలకు పిల్లలు పుట్టాయి. వాటిని ఆప్యాయంగా సాకుతోంది ఆ కోడి. కోడి తల్లితో చలాకీగా అటు ఇటు తిరుగుతూ నెమలి పిల్లలు సందడి చేస్తున్నాయి. జాతి వేరైనా గుడ్లను పొదిగి ఇలా తల్లీలా పిల్లలను సాకుతొంది. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also read :Telangana: ఊరు చివర మామిడితోట.. తోటకెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో చూస్తే

కోడి, నెమలి జాతులు వేరు. అయినప్పటికీ ఆ నెమలి పిల్లలకు మాతృ ప్రేమను పంచుతుంది కోడిపెట్ట. అల్లూరి ఏజెన్సీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ గిరిజనుడు అడవిలోకి వెళ్లడంతో.. అక్కడ కొన్ని గుడ్లు కనిపించాయి. భలే ఉన్నాయిలే అనుకొని.. తీసుకొచ్చి తన దగ్గర పెంచుకుంటున్న కోడిపెట్ట కింద పొదగడానికి పెట్టాడు. దాదాపు 3వారాల తర్వాత ఆ గుడ్లు పొదిగి పిల్లలు బయటికి వచ్చాయి. పిల్లలు పుట్టినప్పటినుంచి ఆ కోడి తల్లి వాటిని సాకుతూ కనిపించింది. నెమలి పిల్లలయినప్పటికీ.. తన పిల్లల్లా ప్రేమను పంచి వాటిని జాగ్రత్తగా చూసుకుంటుంది.

Also read :ఫోన్‌లో డాక్టర్.. గర్భిణీకి నర్సులు ట్రీట్మెంట్! ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకంతో !

ఆశ్చర్యకరంగా ఆ పిల్లలు..

కోడితో తిరుగుతున్నప్పటికీ.. ఆ పిల్లలు క్రమంగా వయసు పెరిగే కొద్దీ వాటిలో మార్పులు కనిపిస్తున్నాయి. తలపై చిన్న పించంతో చలాకీగా అటు ఇటు తిరుగుతున్నాయి. దీంతో ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాల వాసులకు తెలియడంతో.. వాటిని చూసేందుకు తరలివస్తున్నారు. ముద్దు ముద్దుగా అడుగులు వేస్తూ సందడి చేస్తున్న ఆ నెమలి పిల్లలను చూస్తూ ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారు పిల్లలు.

Also read :ఇస్రో ఉద్యోగిగా పరిచయం.. అందంతో వలపు వల.. నమ్మించి లక్షల్లో ముంచి

వీడియో…
నెమలి 1963 సంవత్సరంలో భారతదేశ జాతీయ పక్షిగా ప్రకటించబడింది. ఈ పక్షి భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం రక్షించబడింది. షెడ్యూల్ 1 కు చెందిన పక్షి నెమలి. నెమళ్ళు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆడ నెమలిని సిహాన్ అని కూడా అంటారు. నెమళ్ళను బంధించడం, రవాణా, వేటాడడం, క్రయవిక్రయాలు చేయడం నిషేధం… నేరం

Also read :తెలంగాణలో మరో భారీ స్కాం.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కేసు!

Related posts

Share via