November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

వీడు మామూలోడు కాదు.. ఆదమరిస్తే అంతే సంగతలు..! ఎలా వచ్చిందబ్బా ఈ ఐడియా..?

తెనాలి నుండి నెల్లూరు వరకూ ప్రయాణిస్తూ రైల్వే ప్రయాణీకుల వద్ద నుండి విలువైన వస్తువులు కాజేస్తున్న కేటుగాడి ఆటను రైల్వే పోలీసులు కట్టించారు. గత కొంతకాలంగా చీరాల రైల్వే పోలీస్ స్టేషన్ దొంగతనాల కేసులు ఎక్కువై పోతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవుకు చెందిన వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ పేరు తెరపైకి వచ్చింది. సాంకేతిక ఆధారాల సాయంతో వివరాలు సేకరించిన రైల్వే పోలీసులు చీరాల స్టేషన్ లో ఉన్న వెంకటేశ్వర్లను గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 3.81 లక్షల రూపాయల విలువైన 62 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 సెల్ ఫోన్లు, 4 ల్యాప్ ట్యాప్‌లు, ఒక ఐ ప్యాడ్, మూడు వాచీలను స్వాధీనం చేసుకున్నారు.

Also read :అసలీ నోట్లను మించిన నకిలీ నోట్లు.. ఫేక్ కరెన్సీ గుట్టురట్టు..

వెంకటేష్ వ్యసనాలను లోనయ్యాడు. విలసవంతమైన జీవితాన్ని గడపటానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే చేతికి కావల్సినంత డబ్బు కోసం ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. ఇదే సమయంలో తనకు కావాల్సినంత డబ్బులు రావాలంటూ రైళ్లలో దొంగతనాలు చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఇందుకోసం సినిమాల్లో రైళ్ల దొంగతనాలను పరిశీలించాడు. కొన్ని సోషల్ మీడియా సైట్స్ లోనూ రైలు దొంగతనాలు ఎలా చేయాలో చూశాడు. ఇక అప్పటి నుండి రైళ్లలో దొంగతనాలు చేస్తూ తనకు కావాల్సినంత కొట్టేయడం చేస్తున్నాడు. అయితే వరుస వెంట జరుగుతున్న దొంగతనాలపై దృష్టి సారించిన పోలీసులకు వెంకటేష్ దొరికిపోయాడు. అయితే రైలు ప్రయాణాల్లో అపరిచితులను నమ్మవద్దని చీరాల రైల్వే పోలీసులు మరోసారి హెచ్చరించారు

Also read :దుష్ప్రచారం తట్టుకోలేక యువజంట ఆత్మహత్య.! కానీ అనుకోకుండా అనుకోని స్థితిలో..

Related posts

Share via