ఒంగోలు::
చలికాలం రానున్నదని, ఋతుపవనాల రాకతో వర్షాలు పడుతుండడంతో నిలువ నీడలేక అయినవారు తోడు లేక షాపుల ముందు డివైడర్ ల మీద దేవాలయాల వద్ద వర్షానికి తడిచి చలికి గజగజ వణుకుతూ ఇబ్బందులు పడుతున్న అభాగ్యులను చూసి మనసు వారికి ఏదైనా సహకారం అందించాలనే ఆలోచనతో ఫ్యామిలీ క్లబ్ 34వ సమాజ సేవలో భాగంగా వారికి చలి దుప్పట్లు దుస్తులు ఆహారం అందించడం జరిగిందని ఫ్యామిలీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు తెలిపారు.
ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పి వీర రాఘవరావు, టి వెంకటేశ్వర్లు, కే సుబ్రహ్మణ్యం, కె.వి సురేష్, టి శ్రీను, సిహెచ్ శ్రీహరి, ఎస్ ఫణి రాజ్, కే బాలచంద్ర ప్రసాద్, టీవీ సురేష్, పి విజయ్ కృష్ణ, బి కె వి రమేష్, కె వి చంద్రమౌళి, అరవపల్లి మధు, కోట కిరణ్, సి హెచ్ ఆర్ సుబ్రహ్మణ్యం, శ్రీను, ఎం రామారావు, తాతా రామకృష్ణ మరియు ఎన్ వి గుప్తా తదితరులు పాల్గొన్నారు.
జూలై 14 వ తేదీ ఆదివారం ఉదయం ఫ్యామిలీ క్లబ్ సభ్యులు రెండు భాగాలుగా విడిపోయి ట్రంకు రోడ్డు, కలక్టరేట్, లాయర్పేట, కేశవస్వామిపేట తదితర ప్రాంతాల్లో ఫుట్ పాత్ ల పైన, ఆలయాల వద్ద గల నిరుపేద అభాగ్యులకు దుప్పట్లు, చలి దుస్తులు, ఆహారం పంపిణీ చేశారు. మరియు మడనూరు గోశాలకు దానా పంపిణీ చేశారు.