వైద్యరంగంలో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో అవయవాల అక్రమ రవాణా. కొందరు ముఠాలు ఈ దందాకు తెరలేపి..కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓముఠాను పోలీసులు పట్టుకున్నారు.
నేటికాలంలో అక్రమ, అవినీతి మార్గాల్లో డబ్బులు సంపాందించే వారి సంఖ్య బాగా పెరిగింది. కష్టపడి సంపాదించడం చేతకాక..అడ్డదారుల్లో భారీగా ధనం సంపాదిస్తుంటారు. డ్రగ్స్, గంజాయి, అక్రమంగా బంగారం వంటివాటిని కొన్ని ముఠాలు సప్లయ్ చేస్తుంటాయి. వీరే దారుణం అంటే వైద్య రంగంలో కూడా కొన్ని ముఠాలు ఉన్నాయి. అవయవాలను అక్రమంగా రవాణ చేస్తూ.. కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా అలాంటి ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు చేధించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మంగళవారం ఢిల్లీ పోలీసులు ఓ ముఠా గుట్టును రట్టు చేశారు. అక్రమంగా మానవ అవయవాలను రవాణ చేస్తున్నా ఈ ముఠాను పక్క ప్లాన్ తో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ ముఠాకు సూత్రధారి బంగ్లాదేశ్ కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఒక మహిళా డాక్టర్ సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ ముఠా గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమిత్ గోయేల్ కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసు వెనుక ఉన్న ‘మాస్టర్ మైండ్’ బంగ్లాదేశీ అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అవయవాలు దానం చేసే వారు..తీసుకునే వారు ఇద్దరూ బంగ్లాదేశ్ కు చెందినవారే అని తెలిపారు. ఈ ముఠాలోని అందరికీ బంగ్లాదేశ్‌తో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రోగులు, దాతల మధ్య మధ్యవర్తిగా ఉండే రస్సేల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ చేశారు. 2019 నుంచి ఈ అవయవాల అక్రమ రవాణ దందా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇకలా అవయవాలను ఇచ్చే క్రమంలో ఒక్కొక్కరి నుంచి 25 నుంచి 30 లక్షలు వసూలు చేసేవారని పోలీసులు వెల్లడించారు.ఇక పోలీసులు అరెస్టు చేసిన డాక్టర్ కు ఢిల్లీలోని రెండు, మూడు ఆస్పత్రులతో సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. మానవ అవయవాల మార్పిడి చట్టం-2014 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురిపై విచారణ ఇంకా కొనసాగుతోంది.
Also read :లవ్ మ్యారేజ్.. భర్త పనిమీద వెళ్తున్నాడని తెలిసి..
ఈ కేసులో మహిళ వైద్యురాలి పాత్ర ఏమిటంటే, దాత గ్రహితలు రక్తసంబంధాలు కాదని ఆమెకు తెలిసినప్పుడు కూడా ఆమె అవయవ మార్పిడిని పనిని ఈజీగా చేసింది. దీంతో ఆమె ఆమె కుట్రలో భాగమైందని డిసిపి గోయెల్ చెప్పారు. మానవ అవయవాల మార్పిడి చట్టం-2014 ప్రకారం, తల్లిదండ్రులు, తోబుట్టువుల వంటి రక్త సంబంధాల నుండి మాత్రమే అవయవ దానం అనుమతించబడుతుంది. అవయవ దానం చేయడానికి అర్హులైన భారతీయ రోగి లేకుంటే మాత్రమే ఈ కేసులు కూడా పరిగణించబడతాయి. మొత్తంగా అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చిన పోలీసులు తాజాగా.. ఈ ముఠా గుట్టును రట్టు చేశారు
Also read :Hyderabad: బరితెగించిన సైబర్ బూచోళ్లు.. మెయిల్ హ్యాక్ చేసి ఏకంగా రూ.11.4 కోట్లు దోచేశారు!