November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

కన్నబిడ్డ కన్నా ఎ‍క్కువగా చూసుకున్నారు కదా తల్లి.. అయినా ఎందుకు ఇంత దారుణం

పిల్లలు లేని ఆ దంపతులు ఓ ఆడబిడ్డను దత్తత తీసుకుని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. కానీ ఆ యువతి చేసిన పనికి.. దంపతులకు తీరని శోకం కలిగింది. ఆ వివరాలు..

ఆ దంపతులకు చాలా ఏళ్లుగా సంతానం లేదు. దాంతో మిగతా వారిలా బిడ్డల కోసం మరో పెళ్లి చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకోలేదు. కంటేనే మన బిడ్డ అవుతుందా.. ప్రేమతో పెంచుకున్నా మన బిడ్డే అవుతుంది.. పైగా కన్న ప్రేమ కన్నా.. పెంచిన ప్రేమ చాలా గొప్పది అని అంటారు కదా.. అని భావించిన ఆ దంపతులు.. ఓ ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. కన్న బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పించారు. అందుకు తగ్గట్టుగానే ఆయువతి కూడా ఉద్యోగం సంపాదించింది. ఇక మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని భావించారు. ఆ ప్రయత్నాలు చేస్తుండగా.. దారుణం చోటు చేసుకుంది. కన్నబిడ్డ కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటే.. ఆ యువతి మాత్రం దారుణానికి ఒడిగట్టింది. ఇంతకు ఏం జరిగింది అంటే..

శ్రీకాకుళం జిల్లా, కొత్తవలస మండలంలో తీవ్ర విషాకర సంఘటన చోటు చేసుకుంది. పిల్లలు లేని దంపతులు.. ఓ ఆడబిడ్డను దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ప్రయోజకురాలైన కూతురు.. తమకు అండగా నిలుస్తుందని భావించిన ఆ తల్లిదండ్రలు ఆశలను అడియాలసుల చేస్తూ.. ఆత్మహత్య చేసుకుని… వారికి తీరని కడుపుకోత మిగిల్చింది ఆయువతి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త వలస మండలం, సీతంపేటకు చెందిన శ్రీను, పద్మ దంపతులకు పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.. సంతానం కలగలేదు. దాంతో కొన్నేళ్ల కిందట సంధ్య(19) అనే యువతిని దత్తత తీసుకున్నారు. ఇటీవలే సంధ్య.. కంచరపాలెంలోని ఐటీఐ కళాశాలలో పాలిటెక్నికల్‌ పూర్తి చేసింది. అంతేకాక క్యాంపస్‌ సెలక్షన్‌లో భాగంగా చిత్తూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం సాధించింది.

కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న కుమార్తె.. జీవితంలో ప్రయోజకురాలు అయ్యింది.. ఉద్యోగం సాధించి.. తన కళ్ల మీద తాను నిలబబడింది అని ఎంతో సంతోషించారు శ్రీను, పద్మ దంపతులు. అయితే కొన్ని రోజుల క్రితమే సంధ్య అస్వస్థతకు గురైంది. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఇంటివద్దే ఉంటోంది. దంపతులిద్దరూ ఆదివారం పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. సంధ్య ఒక్కతే ఇంట్లో ఉంది.
Also read :అతడ్నినమ్మడమే పూజ పాలిట శాపమైంది.. వారం రోజుల తర్వాత

ఈక్రమంలో పక్కింటి మహిళ సంధ్యకు భోజనం ఇవ్వడం కోసం మధ్యాహ్నం సమయంలో ఆమె ఇంటికి వెళ్లింది. డోర్‌ కొట్టింది.. ఎలాంటి స్పందన లేదు. ఏం జరిగిందో అని భావించి.. కిటికీలో నుంచి చూసేసరికి సంధ్య.. ఫ్యాన్‌కు ఉరేసుకుని.. వేలాడుతూ కనిపించింది. ఈ ఘటన చూసిన సదరు మహిళ.. గట్టిగా కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని.. ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. ఇక సంధ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Also read :Cyber ​Frauds: మహిళలు, యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్.. రెచ్చిపోతున్న మాయగాళ్లు..! సైబర్‌ నేరాలు రోజురోజుకూ

Also read :ఈ యాప్‌ మీ ఫోన్‌లో ఉంటే జాగ్రత్త.. ప్రభుత్వం హెచ్చరిక

Related posts

Share via